ఆత్మహత్యాయత్నం చేసిన ప్రేమికులకు పెళ్లి

తమ ప్రేమ విఫలమవుతున్నదన్న బాధతో ఆత్మహత్యకు యత్నించిన ప్రేమికులు దవాఖానలో చికిత్స పొందుతూ వివాహం బంధంతో ఒక్కటయ్యారు. మూడు రోజులుగా చికిత్స నిర్వహించిన అనంతరం ఇరువురికీ ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారు.

Update: 2019-01-11 03:58 GMT
love marriage

తమ ప్రేమ విఫలమవుతున్నదన్న బాధతో ఆత్మహత్యకు యత్నించిన ప్రేమికులు దవాఖానలో చికిత్స పొందుతూ వివాహం బంధంతో ఒక్కటయ్యారు. మూడు రోజులుగా చికిత్స నిర్వహించిన అనంతరం ఇరువురికీ ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారు. రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు చక్రాల కుర్చీలపై ప్రేమికులను తీసుకొచ్చి ఆసుపత్రిలోనే పెళ్లి చేశారు.

వికారాబాద్ జిల్లా ధారూర్‌ మండలం కుక్కిందకు చెందిన నవాజ్, అత్వెల్లికి చెందిన రేష్మాబేగం లు ప్రేమించుకున్నారు. ఇద్దరూ వివాహం చేసుకుంటామని చెప్పగా, పెద్దలు తిరస్కరించారు. దీంతో మనస్తాపం చెందిన రేష్మాబేగం ఈనెల 8న అత్వెల్లిలోని తన ఇంట్లో పురుగుల మందు తాగింది. ఆమెను వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రియురాలిని ఆసుపత్రిలో పరామర్శించిన నవాజ్ పురుగుల మందు తాగాడు. వెంటనే అతడికి డాక్టర్లు చికిత్స అందించారు. మూడు రోజుల చికిత్స తర్వాత నవాజ్ , రేష్మాబేగంలకు ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారు. ప్రేమికుల ప్రేమను రెండు కుటుంబాలు పెద్దలు అర్థం చేసుకున్నారు. ఇరువర్గాల పెద్దలు చక్రాల కుర్చీలపై లవర్స్ ను తీసుకొచ్చి ఆసుపత్రిలోనే పెళ్లి చేశారు.

Similar News