ఆరవదశ పోలింగ్ ఓ అద్భుతాన్ని చూడబోతోంది

Update: 2019-05-11 13:42 GMT

ఆరవదశ పోలింగ్ ఓ అద్భుతాన్ని చూడబోతోంది శతాధిక వృద్ధుడొకరు ఈ పోలింగ్ లో పాలు పంచుకుంటున్నారు. దేశానికి స్వాతంత్ర్యం రాకముందు పుట్టిన ఈ తాతగారు భారత స్వాతంత్ర సంగ్రామానికి, ఆ తర్వాత స్వేచ్ఛాయుత ఎన్నికల ప్రక్రియకు ఒక నిలువుటద్దంలా నిలబడ్డారు.

ఈయన వయసు 111 ఏళ్లు అయితేనేం నేనూ నా నియోజక వర్గంలో అభ్యర్ధిని ఎన్నుకుంటానంటున్నారు ఈ తాతగారు దేశ రాజధాని ఢిల్లీలోకే అతిపెద్ద వయస్కుడైన ఈ ఓటరు పేరు బచ్చన్ సింగ్ పశ్చిమ ఢిల్లీలోని తిలక్ నగర్ లో ఉంటున్న ఈ తాతగారు ఒక్క ఓటు కూడా వేస్ట్ కాకూడదంటున్నారు. తమ ఇంట్లో ఇంత వయసున్న ఓటరు ఉండటం తమ అదృష్ట మంటున్నారు బచ్చన్ కుటుంబ సభ్యులు. బచ్చన్ సింగ్ కు తోడుగా మరో ఓటరు కూడా ఆరోదశ పోలింగ్ లో ఓటేయబోతున్నారు. దాదాపు దశాబ్దం నుంచి వయస్సు పరమైన ఇబ్బందులతో బాధపడుతున్న 110 ఏళ్ల రాంప్యారీ శంకర్ కూడా తూర్పు ఢిల్లీలోని కొండ్లి నుంచి ఓటేస్తున్నారు.

మరోవైపు వందేళ్లు దాటిన వృద్ధ ఓటర్ల కోసం ఢిల్లీ పోలింగ్ బూత్ లలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు వారికి ఉచితంగా పికప్, డ్రాపింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. వారికి బొకేలిచ్చి, స్వాగతం పలికి, సెల్ఫీలు కూడా దిగే ఏర్పాట్లు చేస్తున్నారు వృద్ధులలో తాము వీఐపీలమన్న భావన కలిగేలా చేసేందుకే ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 164 మంది అభ్యర్ధులున్న ఢిల్లీలో ఏడు ఎంపీ సీట్లకు పోటీ జరుగుతోంది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య ముక్కోణపు పోటీ జరుగుతోంది. మొత్తం కోటీ43 లక్షల మంది ఓటర్లున్న ఢిల్లీలో 669 మంది థర్డ్ జెండర్ ఓటర్లున్నారు.

Similar News