Retirement Plan: మీరు జాబ్‌ చేస్తున్నారా.. రిటైర్మెంట్‌ తర్వాత కోటి రూపాయలు సరిపోతాయా..!

Retirement Plan: ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ రిటైర్మెంట్‌ ప్లాన్‌ కచ్చితంగా చేసుకోవాలి. లేదం టే ఆ వయసులో ఆర్థికంగా చాలా ఇబ్బందిపడుతారు

Update: 2024-05-07 09:32 GMT

Retirement Plan: మీరు జాబ్‌ చేస్తున్నారా.. రిటైర్మెంట్‌ తర్వాత కోటి రూపాయలు సరిపోతాయా..!

Retirement Plan: ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ రిటైర్మెంట్‌ ప్లాన్‌ కచ్చితంగా చేసుకోవాలి. లేదం టే ఆ వయసులో ఆర్థికంగా చాలా ఇబ్బందిపడుతారు. ఎవరో ఒకరిపై ఆధారపడి బతకాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. ప్రతి వ్యక్తి తను ఉద్యోగంలో చేరగానే రిటైర్మెంట్‌ గురించి ఆలోచిం చాలి. కొంతమంది తెలివైనవారు రిటైర్మెంట్‌ తర్వాత దాదాపు ఒక కోటి రూపాయల నిధి ఏర్పా టు చేసుకుంటారు. అయితే ఆ కోటి రూపాయలు సరిపోతాయా.. ఈ విషయం ఆర్థిక నిపుణులు ఏం చెబుతున్నారో ఈ రోజు తెలుసుకుందాం.

వాస్తవానికి రిటైర్మెంట్‌ తర్వాత ఎంత డబ్బు మెయింటెన్‌ చేయాలనే దానికి సరైన సమాధానం ఉండదు. ఇందుకోసం ప్రతి వ్యక్తి జీవనశైలి ఆధారంగా లెక్కించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు ఉన్న జీవనశైలి 60 ఏళ్ల వయసులో ఉండకపోవచ్చు. మరింత భిన్నంగా ఉండొచ్చు. మనం జాబ్‌ చేసేటప్పుడు రూ.1 కోటి అంటే గొప్పగా అనిపించినప్పటికీ రిటైర్మెంట్‌ తర్వాత అది తక్కువే అవుతుంది. ఎందుకంటే కొందరు పొదుపు జీవనశైలిని పాటిస్తారు. మరికొందరు ప్రయాణాలు, సౌకర్యవంతమైన విశ్రాంతి, మెరుగైన ఆరోగ్య సంరక్షణ, ఇంకా ఇతర కార్యకలాపాల ను కొనసాగించాలని అనుకుంటారు. రిటైర్మెంట్‌ ప్లాన్‌ చేస్తున్నప్పుడు వీటన్నింటిని లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ద్రవ్యోల్భణాన్ని కూడా పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఒక్కొక్కరి జీవనశైలిని బట్టి అమౌంట్‌ మారుతూ ఉంటుంది.

రిటైర్మెంట్‌ తర్వాత ఎలాంటి కారణం లేకుండా ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ బీమా ఖరీదవుతుంది. కాబట్టి వైద్య ఖర్చులు, ఆరోగ్య బీమా కోసం ముందుగా నే ప్లాన్‌ చేసుకోండి. మీకు వైద్య బీమా లేకుంటే రిటైర్మెంట్‌ నిధిలో ఊహించని తరుగుదలను ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రతి నెలా ఒక వ్యక్తి రూ.50 వేలు ఖర్చు చేస్తే, 30 ఏళ్ల 4 నెలల వరకు సరిపోతుంది. అదే రూ.75 వేలు ప్రతి నెలా ఖర్చు చేస్తే 20 ఏళ్ల 7 నెలల వరకు సరిపోతుంది. ప్రతి నెలా రూ.1 లక్ష వరకు ఖర్చు చేస్తే, రూ.1 కోటి నిధి 12 ఏళ్ల 3 నెలల వరకు మాత్రమే సరిపోతుంది. అందుకే మీ జీవనశైలిని అనుసరించి రిటైర్మెంట్‌ ఫండ్‌ అనేది క్రియేట్‌ చేసుకోవాలి.

Tags:    

Similar News