హాట్స్ ఆఫ్ : తండ్రి చనిపోయాడని తెలిసినా దేశం కోసం ఆడింది ..

Update: 2019-06-26 06:55 GMT

ఒక వైపు కన్న తండ్రి చనిపోయాడన్న వార్త .. మరో వైపు దేశం కోసం అడాల్సిన మ్యాచ్ .. కానీ ఎక్కడ కూడా దైర్యం కోల్పోలేదు అ క్రీడాకారిణి.. తండ్రి చివరి చూపు కోసం వెళ్ళకుండా దేశం కోసం పోరాడింది .. గెలిచింది.. మిజోరాంకి చెందిన 19ఏళ్ల భారత హాకీ క్రీడాకారిణి లాల్‌రెమ్సియామీ. గత ఆదివారం భారత మహిళా హాకీ జట్టు జపాన్‌లోని హిరోషిమాలో జరిగిన హాకీ ఎఫ్‌ఐహెచ్‌ సిరిస్‌లో ఆతిథ్య జపాన్‌పై గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది . ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరి 2020 ఒలింపిక్స్‌కు అర్హత కూడా సాధించింది.

ఆమె తండ్రి లాల్‌తన్సంగా జోత్‌ శుక్రవారం గుండెపోటుతో మృతిచెందారు. అయితే ఈ విషయం ఆమెకి తెలిసినప్పటికీ తన తండ్రిని చూడకుండా వెళ్ళకుండా ఫైనల్ మ్యాచ్ ని ఆడింది ..  తన కోచ్‌తో 'నన్ను చూసి నా తండ్రి గర్వపడాలంటే నేను ఇక్కడే ఉండి టోర్నీలో ఆడాలని' చెప్పారట. ఫైనల్‌ విజయాన్ని లాల్‌రెమ్సియామీ తండ్రికి అంకితం చేశారు.మంగళవారం స్వగ్రామానికి చేరుకున్నారు. తల్లిని హత్తుకుని కన్నీటి పర్యంతమయ్యారు. 



Tags:    

Similar News