గాడ్సే దేశభక్తుడైతే.. గాంధీ దేశద్రోహా..? సాధ్వీ వ్యాఖ్యలపై భగ్గుమన్న విపక్షాలు

Update: 2019-05-17 01:32 GMT

మధ్యప్రదేశ్ భోపాల్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీని చంపిన నాథూరాం గాడ్సే గొప్ప దేశభక్తుడని అన్నారు. సాధ్వీ కామెంట్స్‌పై బీజేపీతో పాటు అన్ని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో సాధ్వీ దిగి వచ్చారు. క్షమాపణలు చెప్పారు. భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీని చంపిన నాథూరాం గాడ్సే గొప్ప దేశభక్తుడని అన్నారు. గాడ్సేను ఉగ్రవాదితో పోల్చిన వ్యక్తులకు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.

నాథూరాం గాడ్సే దేశభక్తుడంటూ సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. స్వాధ్వీ వ్యాఖ్యలను బీజేపీ ఖండిస్తోందని పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. సాధ్వీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని జీవీఎల్ అన్నారు.నాథూరాం గాడ్సే దేశభక్తుడంటూ సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. సాధ్వీ చేసిన వ్యాఖ్యలను దేశ ప్రజలు ఎప్పటికీ క్షమించరని రణదీప్ అన్నారు. సాధ్వీని వెంటనే బీజేపీ నుంచి బహిష్కరించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.

సాధ్వీ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని వెనకేసుకురావడమే కాదు, ఆమె అభ్యర్థిత్వాన్ని కూడా నరేంద్ర మోడీ బలపరుస్తున్నారని ఒవైసీ మండిపడ్డారు. జాతి పితను అవమానించిన ఆమె బేషరతుగా క్షమాపణలు చెప్పాల'ని కేటీఆర్ ట్వీట్ చేశారు. గాంధీని చంపిన గాడ్సే దేశభక్తుడైతే.. మహాత్ముడు దేశద్రోహా? అని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. మరికొన్నేళ్లలో వీళ్లు శ్రీ శ్రీ గాడ్సే గారి పేరు భారతరత్న అవార్డుకు కూడా సిఫారసు చేస్తారు. చూస్తూ ఉండండి అంటూ ట్వీట్ చేశారు. 

Similar News