కేశినేని అలకకు కారణం అదేనా?

Update: 2019-06-06 00:43 GMT

పార్లమెంటరీ విప్ పదవిని తిరస్కరిస్తూ టీడీపీ ఎంపీ కేశినేని నాని సోషల్ మీడియాలో చేసిన పోస్టు కలకలం రేపింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎంపీలు నాని, గల్లా జయదేవ్‌తో చర్చించారు. ఈ భేటీతో నాని పోస్టుతో రేగిన అలజడిని చలార్చే ప్రయత్నం చేశారు చంద్రబాబు. విజయవాడ ఎంపీ కేశినేని నాని పేస్ బుక్ ఫోస్ట్ వ్యవహారానికి ఎండ్ కార్డ్ పడింది. టీడీపీ లోక్‌సభ పక్ష నేతగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌, ఉపనేతగా, పార్టీ విప్‌గా విజయవాడ ఎంపీ కేశినేని నానిని చంద్రబాబు నియమించారు. అయితే ఈ పదవిని తాను తిరస్కరిస్తున్నట్లు తన ఫేస్‌బుక్‌లో నాని పోస్టు చేయడం కలకలం రేపిన విషయం తెలిసిందే.

ఈ వార్త చూసిన గల్లా జయదేవ్ హుటాహుటిన విజయవాడలో కేశినేని నానితో సమావేశం అయ్యారు. ఆయనలో ఉన్న అసంతృప్తిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇద్దరు ఎంపీలు చంద్రబాబుతో భేటీ అయి తాజా పరిణామాలపై చర్చించారు. చంద్రబాబుతో భేటీ అనంతరం పార్టీలో ఎలాంటి సంక్షోభం లేదన్న గల్లా జయదేవ్ ఈ ఎపిసోడ్ ముగిసిందని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే, పార్టీలో మొదట తనకు ప్రాధాన్యం ఇచ్చి ఆ తర్వాత తనను పక్కకుపెట్టడంపై కేశినేని నాని అలిగినట్టు సమాచారం. అసలే కృష్ణా జిల్లా టీడీపీలో ఆధిపత్య పోరు ఎక్కువ. ఏపీ సార్వత్రి ఎన్నికల్లో టీడీపీ ఓటమి తరువాత పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎంపిక,నిర్వహణ బాధ్యతలను కేశినేని నానికి అప్పగించింది పార్టీ అధిష్ఠానం. దానికి నాని కూడా ఆ ప్రయత్నాల్లోనే ఉన్నారు. సరిగ్గా ఈ క్రమంలో మంగళవారం జరిగిన సమావేశంలో పార్టీ కార్యాలయం గురించి దేవినేని ఉమా ఫైనల్ చేస్తారని నిర్ణయం తీసుకున్నారు. అయితే మొదట తనకు బాధ్యత అప్పగించి మళ్లీ ఇప్పుడు దేవినేనిని పగ్గాలు ఇవ్వడంపై నాని అలకబూనారు.


 

Tags:    

Similar News