ఇప్పటికే రుణ సంక్షోభంతో తల్లడిల్లుతూ తీవ్ర నష్టాలపాలైనా జెట్ ఎయిర్వేస్ ప్రస్తుతం కార్యకలాపాలను నిలివేసిన విషయం తెలసిందే. విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు మరో కీలక ఎగ్జిక్యూటివ్ బై చెప్పారు. తాజాగా జెట్ ఎయిర్వేస్ డిప్యూటీ సీఈవో, సీఎఫ్‌వో అమిత్ అగర్వాల్ గుడ్ బై చెప్పారు. అయితే కేవలం తన వ్యక్తిగత కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమిత్ అగర్వాల్ తెలిపారు. ఈ రాజీనామా వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపారు. మే13 నుంచి అమిత్ అగర్వాల్ రాజీనామాను ఆమోదించినట్టు జెట్ ఎయిర్వేస్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
గత నెల రోజుల వ్యవథిలోనే నలుగురు కీలక వ్యక్తులు జెట్ ఎయిర్వేస్ సంస్థను వీడారు. ఇప్పటికే ఇండిపెండెంట్ డైరెక్టర్ రాజశ్రీ పాతీ, అలాగే కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నసీం జైదీ రాజీనామా చేశారు. వీరికితోడు ఇటీవల పూర్తి కాలపు డైరెక్టర్ గౌరాంగ్ శెట్టి జెట్ ఎయిర్వేస్కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.