hmtv చేతిలో జనసేన తొలి జాబితా...32 అసెంబ్లీ, 9 ఎంపీ అభ్యర్థులు ఖరారు

Update: 2019-03-12 02:19 GMT

సార్వత్రిక ఎన్నికల నగారా మోగడంతో అభ్యర్థుల ఖరారుపై జనసేన దృష్టి పెట్టింది. తొలి విడతలో 32 అసెంబ్లీ, 9 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. వారి పేర్లను ఏ క్షణంలోనైనా అధికారికంగా ప్రకటించే అవకాశముంది. జనసేన అసెంబ్లీ, ఎంపీ అభ్యర్థుల పేర్లను hmtv సంపాదించింది.

జనసేన సర్వసభ్య సమావేశంలో అభ్యర్థుల తొలి జాబితాను సిద్ధం చేశారు. 32 అసెంబ్లీ, 9 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌లో వెల్లడించారు. అయితే ఇద్దరి పేర్లను మాత్రమే అధికారికంగా ప్రకటించారు. అమలాపురం లోక్‌సభ అభ్యర్థిగా డీఎంఆర్‌ శేఖర్‌, రాజమండ్రి లోక్‌సభ అభ్యర్థిగా ఆకుల సత్యనారాయణను ఖరారు చేసినట్లు పవన్ తెలిపారు.

జనసేన అసెంబ్లీ అభ్యర్థులుగా ఖరారైన వారిపేర్లను hmtv సంపాదించింది. తెనాలి నియోజకవర్గానికి మాజీ స్సీకర్ నాదెండ్ల మనోహర్ , ప్రత్తిపాడుకి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, పాడేరు అసెంబ్లీ సీటుకు - మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, పి. గన్నవరం నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, రాజమండ్రి రూరల్ స్థానానికి -కందుల దుర్గేష్, గుంటూరు పశ్చిమ -తోట చంద్రశేఖర్, మమ్మిడివరం - పితాని బాలకృష్ణ, కావలి -పసుపు లేటి సుధాకర్ , ఏలూరు -నర్రా శేషు కుమార్, కాకినాడ రూరల్ - పంతం నానాజీ, తాడేపల్లిగూడెం -బొలిశెట్టి శ్రీనివాసరావు, రాజోలు -రాపాక వరప్రసాద్ ధర్మవరం -మధుసూదన్ రెడ్డి, కడప -సుంకర శ్రీనివాస్, కాకినాడ రూరల్ -అనిశెట్టి బుల్లబ్బాయ్, తుని - రాజ అశోక్ బాబు, మండపేట - దొమ్మేటి వెంకటేశ్వర్లు పేర్లు ఖరారయ్యాయి.

కాకినాడ ఎంపీ అభ్యర్థిగా మారిశెట్టి రాఘవయ్య , విశాఖ ఎంపీ స్థానానికి చింతల పార్థసారథి, విజయనగరం లోక్‌సభ నియోజకవర్గానికి గేదెల శ్రీనుబాబు పేర్లు ఖరారయ్యాయి. 32 అసెంబ్లీ మరో ఏడుగురు ఎంపీ అభ్యర్థుల పేర్లను జనసేన ఏ క్షణంలోనైనా ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు పవన్‌కల్యాణ్‌తో వామపక్ష నేతలు భేటీ అయ్యారు. పొత్తులో భాగంగా ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న అంశంపై చర్చించారు. తమకు 26 శాసనసభ, 4 లోకసభ స్థానాలను కేటాయించాలని వామపక్షాలు ప్రతిపాదించాయి. ఆయా నియోజకవర్గాల్లో తమకున్న బలాబలాల గురించి పవన్‌ కల్యాణ్‌‌కు వివరించాయి.

జనసేన వామపక్షాల మధ్య సీట్ల పంపిణీపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక ఈనెల 14న నిర్వహించే జనసేన ఆవిర్భావ సభకు ముందే అభ్యర్థుల జాబితాపై స్పష్టత ఇవ్వాలని అధినేత పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. 

Similar News