తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెర..

తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఈనెల 21వ తేదీ ఉదయం 7గంటల నుంచి ఒంటిగంట వరకూ పోలింగ్ జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Update: 2019-01-19 12:19 GMT

తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఈనెల 21వ తేదీ ఉదయం 7గంటల నుంచి ఒంటిగంట వరకూ పోలింగ్ జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. తొలి విడతలో 4,135 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ ఇవ్వగా అందులో 788 సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యాయి. పలు కారణాలతో 5 పంచాయతీలకు నమినేషన్లు దాఖలు కాలేదు. తొలి విడత పోలింగ్ జరిగే పంచాయతీల్లో నేటితో ప్రచారం ముగియడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే, ఇవాళ సాయంత్రం 5గంటల నుంచి ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే వరకూ ఆయా ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్ చేయాలని ఈసీ ఆదేశించింది. 

Similar News