జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి : ఫాన్స్ ...

Update: 2019-05-26 05:56 GMT

గడిచిన ఏపి ఎన్నికలు టిడిపి పార్టీకి చేదు అనుభవాన్ని మిగిలిచాయి.. గతంలో ఎన్నడు లేనంతగా టిడిపి భారీ ఓటమిని కూడగట్టుకుంది.. ఇప్పుడు పార్టీ పరిస్థితి ఏంటి అన్నది ప్రశ్నార్ధకంగా మారింది .. అయితే ప్రస్తుతం పార్టీ ఉన్నపరిస్థితిలో పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు .. ఏపి ఎన్నికలు ముగిసాక నటుడు బ్రహ్మాజీ , వైసీపీ నేత కొడాలి నాని  జూనియర్ రాజకీయాల్లోకి రావాలి అని అన్నారు ..

జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నుండి 2009 ఎన్నికల్లో ప్రచారం చేసారు .. అ తరవాత అయన సినిమాల్లోనే కొనసాగుతూ వస్తున్నారు .. అయన టిడిపి పార్టీలో ఉండరని చాలా సార్లు వార్తలు వచ్చాయి . అలాంటి పుకార్లకు జూనియర్ ఎన్టీఆర్ పులిస్టాప్ పెట్టేసారు .. తను టిడిపి పార్టీని విడిచి వెళ్ళేది లేదని అది మా తాతగారు స్థాపించిన పార్టీ కాబట్టి చివరి శ్వాసవరకు టిడిపిలోనే కొనసాగుతానని ఆయనే స్వయంగా చెప్పారు ..

అయితే ప్రస్తుతం టిడిపి ఉన్న పరిస్థితిల్లో జూనియర్ అవసరం పార్టీకి ఉందని అయన ఫాన్స్ మరియు టిడిపి కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు ..మళ్లీ వచ్చే ఎన్నికల వరకు టిడిపి పటిష్టంగా ఉండాలి అంటే జూనియర్ రావాలి అని అభిమానులు కోరుకుంటున్నారు . ప్రస్తుతం సినిమాల పైన ద్రుష్టి సాధించిన ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తరన్నది మాత్రం కాలమే నిర్ణయించాలి .. 

Similar News