నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై డ్రెస్ కోడ్‌

విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఇక నుంచి డ్రెస్ కోడ్ పాటించాల్సిందే. సంప్రదాయ దుస్తులు మాత్రమే వేసుకుని ఆలయంలోకి వెళ్లాలి. లేదంటే లోపలికి అనుమతించరు. ఇవాళ్టీ నుంచి డ్రెస్ కోడ్ అమలులోకి వస్తుందని ఆలయ అధికారులు ప్రకటించారు.

Update: 2019-01-01 03:56 GMT
kanakadurgamma Temple

విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఇక నుంచి డ్రెస్ కోడ్ పాటించాల్సిందే. సంప్రదాయ దుస్తులు మాత్రమే వేసుకుని ఆలయంలోకి వెళ్లాలి. లేదంటే లోపలికి అనుమతించరు. ఇవాళ్టీ నుంచి డ్రెస్ కోడ్ అమలులోకి వస్తుందని ఆలయ అధికారులు ప్రకటించారు.

విజయవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నేటి నుంచి డ్రెస్ కోడ్ అమలులోకి రానుంది. దుర్గామాతను దర్శించుకునే భక్తులు కచ్చితంగా డ్రెస్ కోడ్ పాటించాలని అందుకు విరుద్దంగా వ్యవహరిస్తే ఆలయ ప్రవేశం ఉండదని ఆలయ అధికారులు తెలిపారు. స్లీవ్‌లెస్‌ టాప్స్‌, మిడ్డీలు, జీన్స్‌, టీ షర్టులు, స్కర్ట్స్‌, షార్ట్స్‌ను నిషేధించారు.

ముఖ్యంగా మహిళలు చీరలు, లంగా ఓణీలు, పంజాబి డ్రెస్ ఇతర సంప్రదాయ వస్త్రాలు ధరించిరావాలన్నారు. పురుషులు పంచె, లాల్చీ, ప్యాంటు ,చొక్కాతో దర్శనం చేసుకోవాలని సూచించారు. మహిళలు ఎవరైనా నిబంధనలు తెలియకపోతే ఆలయ సిబ్బంది 100 రూపాయలకు అమ్మ వారి చీర అందజేస్తారని, దుస్తులు మార్చుకునేందుకు గదులు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. తిరుమలలో ఇప్పటికే డ్రెస్ కోడ్ అమలులో ఉన్నది. అదే సంప్రదాయాన్ని ఇంద్రకీలాద్రిలోనూ తప్పనిసరిగా చేశారు. 

Similar News