కొత్త పురపాలక చట్టంపై కేసీఆర్‌ కీలక సమీక్ష

Update: 2019-04-12 10:27 GMT

ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఉన్నతాధికారులతో హైలెవల్‌ మీటింగ్‌ నిర్వహిస్తోన్న సీఎం కొత్త మున్సిపల్ చట్టం రూపకల్పనపై చర్చలు జరుపుతున్నారు. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా ప్రజలకు మరింత మంచి సేవలు అందించేందుకు కొత్త చట్టం రూపొందించడానికి కసరత్తు చేస్తున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందేలా కొత్త మున్సిపల్ చట్టం రూపకల్పన చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఇప్పటికే పంచాయతీ రాజ్‌ నూతన చట్టాన్ని తీసుకొచ్చారు. అందుకనుగుణంగా కొత్త పంచాయతీలను ఏర్పాటు చేయడంతో పాటు పంచాయతీలకు అధికారాలు, బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.

కొత్త మున్సిపల్ చట్టం రూపకల్పన చట్టంలో ఏయే అంశాలపై దృష్టిపెట్టాలి? ఏయే బాధ్యతలు పురపాలక సంస్థలకు అప్పగించాలనేదానిపై కీలకంగా అధికారులతో సీఎం కేసీఆర్‌ చర్చిస్తున్నారు. అయితే త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో పురపాలక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ కొత్త చట్టాన్ని ముందే తీసుకురావాలా? లేకపోతే ఎన్నికల తర్వాత తీసుకురావాలా? అనే అంశంపైనా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. 

Similar News