దేశ ఆర్థిక వ్యవస్థను గుణాత్మక దిశగా నడిపించాలి : కేసీఆర్

భారత ఆర్థిక సంఘం మూస పద్ధతిలో కాకుండా వినూత్నంగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

Update: 2019-01-13 03:05 GMT

భారత ఆర్థిక సంఘం మూస పద్ధతిలో కాకుండా వినూత్నంగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థను గుణాత్మక దిశగా నడిపించేందుకు ఆర్థిక సంఘం నడుం బిగించాలని ఆయన సూచించారు. 15వ ఆర్థిక సంఘం రాష్ర్టానికి రానున్న నేపథ్యంలో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ రాష్ట్ర ఆర్థిక శాఖ, ఇతర సీనియర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్థిక విధానాల అమలు తీరులో గుణాత్మక మార్పు లేక ప్రజలు నిరాశకు గురవుతున్నారు అని చెప్పారు. కేంద్రం నుంచి రాష్ర్టాలకు అందాల్సిన వాటాల్లో వివక్ష ఉండటం దురదృష్టకరం అని, వివక్షపూరిత వైఖరితో కేంద్ర ప్రభుత్వాలు రాష్ర్టాలను అగౌరవపరుస్తున్నాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. 

Similar News