టీఆర్ఎస్‌కు సంఖ్యాబలం ఉండొచ్చు...మా సభ్యులకు...

ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తానని సీఎల్పీ లీడర్‌గా ఎన్నికైన భట్టి విక్రమార్క అన్నారు. టీఆర్ఎస్‌కు సంఖ్యాబలం ఉండొచ్చు కానీ, కాంగ్రెస్‌ సభ్యులకు అనుభవం ఉందన్నారు. తమకున్న అనుభవంతో సభలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తామంటున్నారు భట్టి విక్రమార్క.

Update: 2019-01-19 05:09 GMT
Bhatti Vikramarka

ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తానని సీఎల్పీ లీడర్‌గా ఎన్నికైన భట్టి విక్రమార్క అన్నారు. టీఆర్ఎస్‌కు సంఖ్యాబలం ఉండొచ్చు కానీ, కాంగ్రెస్‌ సభ్యులకు అనుభవం ఉందన్నారు. తమకున్న అనుభవంతో సభలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తామంటున్నారు భట్టి విక్రమార్క. తెలంగాణ సీఎల్పీ నేతగా మల్లు భట్టి విక్రమార్కను నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. గత మూడ్రోజులుగా సీఎల్పీ నేతగా ఎవర్ని ప్రకటించాలనే విషయంపై అధిష్టానం.. కాంగ్రెస్ నేతలు చర్చించారు. సీఎల్పీ రేసులో మొదట్నించి భట్టీతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు పేర్లు వినిపించాయి. అధిష్టానం దూతగా వచ్చిన ఏఐసీసీ పరిశీలకుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేతో సమావేశమై అభిప్రాయాలు సేకరించారు. అధిష్టానాన్ని రాహుల్ గాంధీకి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేసి అధిష్టానానికి సమర్పించారు. మల్లు భట్టి విక్రమార్క పేరును ఫైనల్ చేశారు రాహుల్ గాంధీ.

Full View

Similar News