విమానంలో చిరుత పులి పిల్ల స్మగ్లింగ్‌

Update: 2019-02-03 06:32 GMT

చిరుత పిల్లను ఎంచక్కా బ్యాగులో వేసుకుని ఫ్లైటెక్కేశాడో స్మగ్లర్. విమానంలో అది కనిపించకుండా జాగ్రత్త పడినా విమానం దిగాక మాత్రం తప్పించుకోలేకపోయాడు. బ్యాంకాక్ నుంచి చెన్నై వచ్చిన ఓ ప్రయాణికుడి బ్యాగేజ్‌ను చెక్ చేస్తున్న సమయంలో నెలన్నర వయసు ఉన్న చిరుత పులి పిల్ల బయటపడింది. ఇంటెలిజెన్స్ అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారు. భయంతో వణికిపోతున్న చిరుత పిల్లకు విమానాశ్రయ సిబ్బంది పాలుపట్టి ఆకలి తీర్చారు. అనంతరం చెన్నైలోని అరినగర్ అన్నా జూపార్క్‌కు తరలించారు.

Similar News