జైల్లో కూర్చుంటారు కాని .. అఖిలపక్ష భేటికి రారా ? చంద్రబాబు

Update: 2019-01-30 06:01 GMT

అఖిలపక్ష భేటిని విపక్షాలు బహిష్కరించడంపై సీఎం చంద్రబాబు తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా సాధన దిశగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు నిర్వహిస్తున్న అఖిలపక్ష భేటికి రాకపోవడంతోనే విపక్షాల చిత్తశుద్ధి బైటపడిందన్నారు. జైలుకు వెళ్లేందుకు సిగ్గుపడని ప్రతిపక్షం అఖిలపక్ష సమావేశానికి వచ్చేందుకు జంకుతోందంటూ విమర్శించారు. కేంద్రం సహకరించకున్నా అటు వ్యవసాయం ఇటు పరిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. కన్నా లక్ష్మినారాయణతో పాటు వైఎస్‌ఆర్‌, విజయమమ్మ, కాంగ్రెస్ నేతలు ఎన్నో కేసులు వేసి ఓడిపోయారన్నారు. జగన్ అధికార, డబ్బు వ్యామోహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ పార్టీ నేతలకు, కార్యకర్తలకు సూచించారు.

Full View

Similar News