ఎన్నికలకు ముందు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

Update: 2019-03-07 09:53 GMT

ప్రదానమంత్రి మోడీ అధ్యక్షతన గురువారం కేంద్ర మంత్రివర్గం సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రధాని నివాసంలో ఏర్పాటు చేసిన ఈ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. యూనివర్సిటీల అధ్యాపకుల నియామకాల్లో కొత్త రోస్టర్ విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినేట్ నిర్ణయంతో యూనివర్సిటీల్లో అధ్యాపకుల నియామకాలు సులభతరం కానుంది. ఇక ఢిల్లీలో అనధికారిక కాలనీల్లో జీవనం కొనసాగిస్తున్న వారికి యాజమాన్య హక్కులు కల్పనపై కమిటీ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. చక్కెర మిల్లులకు అదనంగా రూ.2790 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. పలు సమస్యలు ఎదుర్కొంటున్న థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను చక్కదిద్దేందుకు మంత్రుల బృం‍దం​చేసిన సిఫార్సులకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోద ముద్ర వేసింది.

Similar News