ఈరోజు (మే-16-శనివారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 16 మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం!

Update: 2020-05-16 00:34 GMT
Andhra Pradesh and Telangana updates from HMTVlive

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 16 మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.






Live Updates
2020-05-16 16:47 GMT

తెలంగాణలో గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 40 కేసులు నమోదు కాగా, ఈ రోజు 55 కేసులు నమోదు అయ్యాయి.

-మరిన్ని వివరాలు 

2020-05-16 15:31 GMT

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వలస కార్మికులపై కీలక తీర్పు వెలువరించింది. వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

-మరిన్ని వివరాలు 

2020-05-16 14:15 GMT

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఎంతో మంది వలస కూలీలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రవాణా వ్యవస్థ పూర్తిగా అందుబాటులోకి రాకపోవడంతో ఎంతో మంది కూలీలు నడకదారిన వారి వారి రాష్ట్రాలకు తరలివెలుతున్నారు. మరి కొంత మంది వారి శక్తిని పూర్తిగా కోల్పోయి నిస్సహాయ స్థితిలో మార్గమధ్యంలోనే కన్నుమూస్తున్నారు.

-మరిన్ని వివరాలు 

2020-05-16 13:55 GMT

ఏపీలోని అన్ని దుకాణాల్లో సామాజిక దూరం పాటించేలా చేయడానికి దుకాణదారులే ముందుకు వచ్చే పరిస్థితి రావాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తమ దుకాణం ముందు దుకాణ దారులే వృత్తాలు గీసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

-మరిన్ని వివరాలు 

2020-05-16 08:55 GMT

ఈ నెల 19, 20, 22 తేదీల్లో విదేశాల నుంచి విశాఖకు విమానాలు రానుండటంతో ఎయిర్‌పోర్ట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

-మరిన్ని వివరాలు

2020-05-16 08:53 GMT

వలస కూలీల నుంచి వచ్చిన ఫోన్‌కాల్‌కు స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్.. వారిని స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేయాలంటూ కలెక్టర్‌ను ఆదేశించారు. లాక్ డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు ఇక్కడే చిక్కుకు పోయిన విషయం తెలిసిందే.

-మరిన్ని వివరాలు

2020-05-16 08:53 GMT

వలస కూలీల నుంచి వచ్చిన ఫోన్‌కాల్‌కు స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్.. వారిని స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేయాలంటూ కలెక్టర్‌ను ఆదేశించారు. లాక్ డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు ఇక్కడే చిక్కుకు పోయిన విషయం తెలిసిందే.

-మరిన్ని వివరాలు

2020-05-16 08:13 GMT

చేతిలో పనిలేదు కడుపు నిండా భోజనం లేదు దీంతో ఎలాగోలా సొంతూళ్లకు చేరుకోవాలన్న ఆలోచనతో కాలినడకను నమ్ముకున్నారు వలస కూలీలు.

-మరిన్ని వివరాలు

2020-05-16 06:50 GMT

ఏపీలో కరోనా కేసులు పెరిగాయి. తాజాగా మరో 48 పాజిటివ్ కేసులు నమోదైనట్లు బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. తాజా కేసులు కలిపితే మొత్తం కేసుల సంఖ్య 2,205 కి చేరింది.

-మరిన్ని వివరాలు

2020-05-16 06:05 GMT

తూర్పుగోదావరిజిల్లా తునిలో కరోనాను జయించి నివాసానికి చేరుకున్న ఇద్దరు మహిళలు ..

పోలీసులతో సహా చప్పట్లు కొట్టి స్వాగతం పలికిన స్థానికులు


Tags:    

Similar News