వలస కూలీల ఫోన్‌కు కేటీఆర్ స్పందన..

వలస కూలీల ఫోన్‌కు కేటీఆర్ స్పందన..
x
KTR (File Photo)
Highlights

వలస కూలీల నుంచి వచ్చిన ఫోన్‌కాల్‌కు స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్.. వారిని స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేయాలంటూ కలెక్టర్‌ను ఆదేశించారు.

వలస కూలీల నుంచి వచ్చిన ఫోన్‌కాల్‌కు స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్.. వారిని స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేయాలంటూ కలెక్టర్‌ను ఆదేశించారు. లాక్ డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు ఇక్కడే చిక్కుకు పోయిన విషయం తెలిసిందే. కొంత మంది కూలీలు శ్రామిక్ రైళ్లలో తమ స్వస్థలాలకు చేరుకోగా మరి కొంత మంది కూలీలు నడుచుకుంటూ తమ రాష్ట్రాలకు చేరుకుంటున్నారు. ఇదే విధంగా ఒడిశాకు చెందిన కూలీలు కూలీలు కూడా తమ గ్రామానికి చేరుకోవడానికి నడకను మొదలు పెట్టారు.

కొంతకాలం క్రితం పనికోసం ముస్తాబాద్ వచ్చిన కూలీలు లాక్‌డౌన్ కారణంగా పనిలేకుండా ఖాళీగా ఉండిపోయారు. ఎలాగయినా వారంతా తమ గ్రామాలకు చేరుకోవాలని కాలినడకన స్వస్థలాలకు బయలుదేరారు. పెద్దూరు చేరుకోగానే పోలీసులు వారిని అడ్డగించి సొంతూళ్లకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో అక్కడే చిక్కుకుపోయారు. దీంతో వారి పరిస్థితిని గమనించిన కొంత మంది నాయకులు వారికి ఆశ్రయం ఇచ్చి రెండు రోజులుగా భోజనాలు కూడా పెడుతున్నారు. కాగా కొంత మంది కూలీలు తమ కష్టాలను మంత్రి కేటీఆర్ కు చెప్పుకుంటే తీరుతుందని వెంటనే ఆయనకు ఫోన్ చేసి తమ గోడు వినిపించారు.

వారి గోసను అర్థం చేసుకున్న కేటీఆర్ వెంటనే స్పందించారు. అక్కడి కలెక్టర్ తో మాట్లాడి కూలీలు వారి స్వస్థలాలకు పంపాల్సిందిగా ఆదేశించారు. వెంటనే కలెక్టర్ కేటీఆర్ ఆదేశాలను పాటిస్తూ కూలీల కోసం అప్పటికప్పుడు ఓ ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసారు. వారికి కావలసిన అవసరాలను తీర్చి వాహనంలో ఎక్కించి ఒడిశా తరలించారు. తమ ఫోన్ కాల్‌కు స్పందించి వాహనం ఏర్పాటు చేసిన కేటీఆర్ ‌కు వలస కూలీలు కృతజ్ఞతలు తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories