వారిని ఆదుకోండి ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఆదేశం

వారిని ఆదుకోండి ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఆదేశం
x
Highlights

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వలస కార్మికులపై కీలక తీర్పు వెలువరించింది. వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వలస కార్మికులపై కీలక తీర్పు వెలువరించింది. వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ వలస కార్మికుల సమస్యలపై ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఇటీవలే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. వలస కులీలను అదుకోవాలని వారికి నగదు, ఆహార భద్రత కల్పించాలని సూచించింది. ఈ విధంగా తీర్పు వెలువరించింది. కాగా, హైకోర్టు తీర్పు పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. వలస కార్మికులను ఆదుకుని, వారికి ఆహార భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

మరోవైపు వలస కార్మికుల బాధ్యత రాష్ట్రాలే తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న వలస కార్మికులను తరలించేందుకు అవసరమైన సదుపాయాలను అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలే కల్పించాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా సూచించారు. కాగా.. వలస కూలీల పరిస్థితి చూస్తే బాధేస్తోందని సీఎం జగన్‌ అన్నారు. వలస కూలీల పట్ల మానవీయ కోణాన్ని మరచిపోవద్దని.. రాష్ట్రం గుండా వెళ్తున్న వలస కూలీలపై ఉదారత చూపాలన్నారు. వలస కూలీల కోసం బస్సులు తిప్పడానికి సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. వలస కూలీల నుంచీ టికెట్టు కూడా అడగవద్దని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories