సూరత్‌లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు కేటీఆర్‌ అభయం

సూరత్‌లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు కేటీఆర్‌ అభయం
x
KTR (File Photo)
Highlights

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఎంతో మంది వలస కూలీలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఎంతో మంది వలస కూలీలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రవాణా వ్యవస్థ పూర్తిగా అందుబాటులోకి రాకపోవడంతో ఎంతో మంది కూలీలు నడకదారిన వారి వారి రాష్ట్రాలకు తరలివెలుతున్నారు. మరి కొంత మంది వారి శక్తిని పూర్తిగా కోల్పోయి నిస్సహాయ స్థితిలో మార్గమధ్యంలోనే కన్నుమూస్తున్నారు. ఇంకా కొంత మంది వలస కార్మికులు మంత్రి కేటీఆర్ కు ఫోన్ ద్వారా, ట్విటర్ ద్వారా వారి గోడును వెల్లబుచ్చడంతో మంత్రి వారిని ఆదుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గత 55 రోజులుగా తెలంగాణకు చెందిన ఎంతో మంది వలస కార్మికులు గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌ పట్టణంలో చిక్కుకుపోయి అష్ఠకష్టాలు పడుతున్నారు.

తినడానికి తిండి లేక, ఉండడానికి వసతి లేక విలవిల లాడుతున్నారు. ఇంక భరీంచలేని స్థితిలో ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుకుగా స్పందించే మంత్రి కేటీఆర్ కు శనివారం ట్వీటర్ ద్వారా వారి సమస్యలను షేర్ చేసారు. తమను తెలంగాణకు వచ్చేట్లుగా సహకరించాలని దాదాపు 34 మంది కూలీలు తమను ఆదుకోవాలని వాపోయారు. డబ్బులు లేక, తిండిలేక ఇక్కడ అల్లాడుతున్నాం దయచేసి అనుమతి ఇప్పించి బస్సులు నడిపి తమను ఇండ్లకు పోయేలా చేయండి. అంటూ వేడుకున్నారు. దీంతో మంత్రి స్పందించి ఈ సమాచారాన్ని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆ కూలీలందరినీ తీసుకొచ్చేందుకు అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకోండి అని సూచించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories