టీఆర్ఎస్ చరిత్రలో అతిపెద్ద విజయం: కేటీఆర్

Update: 2019-06-04 14:39 GMT

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఇది చారిత్రక, అసాధారణ విజయంగా అభివర్ణించిన ఆయన ఈసారి మాత్రం టీఆర్ఎస్ ఎన్నడూలేనంతగా ఘనవిజయం సాధించిందన్నారు. వందశాతం జెడ్పీ స్థానాలను కైవసం చేసుకోవడం ఇంతవరకు దేశంలో ఎక్కడా జరుగలేదు. ఇది చారిత్రక, అఖండ, అసాధారణ విజయం. టీఆర్ఎస్ చరిత్రలో ఇది అతిపెద్ద విజయం. దేశంలో ఏ పార్టీ సాధించని ఘనత టీఆర్ఎస్ సాధించిందని కేటీఆర్ అన్నారు. తమపై ఈస్థాయిలో ఆదరాభిమానాలు చూపించిన ప్రజలకు రుణపడి ఉంటామని తెలిపారు.  

Tags:    

Similar News