జగన్‌పై హత్యాయత్నం కేసు కీలక మలుపు

జగన్‌పై హత్యాయత్నం కేసు కీలక మలుపు తీసుకుంది. జగన్‌పై కోడికత్తితో జరిగిన దాడి ఘటనను ఎన్‌ఐఏకు అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు దర్యాప్తు విషయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు ఎన్‌ఐఏకు కేసును అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Update: 2019-01-04 06:08 GMT
ys jagan

జగన్‌పై హత్యాయత్నం కేసు కీలక మలుపు తీసుకుంది. జగన్‌పై కోడికత్తితో జరిగిన దాడి ఘటనను ఎన్‌ఐఏకు అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు దర్యాప్తు విషయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు ఎన్‌ఐఏకు కేసును అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది అక్టోబర్ 25న వైసీపీ అధినేత జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో దాడి జరిగింది.

దర్యాప్తు ఆలస్యమైతే, సాక్ష్యాలు తారుమారు అవుతాయంటూ పిటిషనర్ వాదించారు. ఎన్ఐఏ యాక్ట్ సెక్షన్ 6 ప్రకారం, కేసును ఎన్ఐఏకు బదిలీ చేయాలని కోరారు. పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జగన్ పై కత్తిదాడి కేసులో నిర్ణయం చెప్పాలని గతంలోనే హైకోర్టు ఏపీ, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులిచ్చింది.

విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై జరిగిన కోడికత్తి దాడి కేసును దర్యాప్తు చేయాలని సీఐఎస్ఎఫ్ ఇప్పటికే ఎన్ఐఏకు సిఫార్సు చేసింది. సీఐఎస్ఎఫ్ సిఫార్సుతో ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ ను కూడా నమోదు చేసింది. ఈ నేపధ్యంలో ఇప్పుడు తాజాగా ఏపీ హైకోర్టు జగన్ పై దాడి కేసు ను ఎన్‌ఐఏకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Similar News