ఏపీ బడ్జెట్‌లో ఆరు కొత్త పథకాలు

Update: 2019-02-05 10:44 GMT

ఏపీ బడ్జెట్‌లో ఈసారి కొత్త పథకాలు వచ్చి చేరాయి. ఆరు కొత్త పథకాలను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. వీటికి కూడా బడ్జెట్ లో కేటాయింపులు జరిపారు. సంక్షేమ పథకాలకు భారీ ఎత్తున బడ్జెట్ కేటాయించారు యనమల.

ఏపీ శాసనసభలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కొత్తగా 6 పథకాలను ప్రవేశపెట్టారు. వీటికి కూడా బడ్జెట్ లో కేటాయింపులు జరిపారు. కొత్తగా ప్రవేశపెట్టిన పథకాల్లో అన్నదాత సుఖీభవ, క్షత్రియ కార్పొరేషన్, గృహనిర్మాణాలకు భూసేకరణ, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం, డ్రైవర్ల సాధికార సంస్థ, మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పన ఉన్నాయి.

బడ్జెట్ లో అన్నదాత సుఖీభవ కు రూ. 5 వేల కోట్లు, క్షత్రియ కార్పొరేషన్ కు రూ. 50 కోట్లు, గృహ నిర్మాణాలకు భూసేకరణ కు రూ. 500 కోట్లు, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం కోసం రూ. 400 కోట్లు కేటాయించారు. డ్రైవర్ల సాధికార సంస్థ కు రూ. 150 కోట్లు, మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పన కు రూ. 100 కోట్లు బడ్జెట్ లో ప్రకటించారు.

పలు సంక్షేమ పథకాలకు బడ్జెట్ లో భారీ కేటాయింపులు జరిగాయి. వ్యవసాయానికి రూ. 12,732 కోట్లు, బీసీ వెల్ఫేర్‌ రూ.8,242 కోట్లు , వైద్యారోగ్యశాఖకు రూ. 10,032కోట్లు, గృహనిర్మాణశాఖకు రూ.4079కోట్లు , పరిశ్రమలశాఖకు 4,114 కోట్లు, మైనార్టీ వెల్ఫేర్‌కు రూ. 1308 కోట్లు, సోషల్‌ వెల్ఫేర్‌కు రూ. 6861 కోట్లు, మహిళాశిశు సంక్షేమశాఖకు రూ. 3408 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి యనమల ప్రకటించారు.

మత్స్యశాఖ అభివృద్ధికి రూ. 100 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్‌ కింద రూ. 14,367 కోట్లు, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద రూ. 5,385 కోట్లు, బీసీ సబ్‌ప్లాన్‌ కింద రూ. 16,226 కోట్లు, మైనార్టీ సబ్‌ప్లాన్‌ కింద రూ. 1,304 కోట్లు, పసుపు- కుంకుమ కింద రూ. 4 వేల కోట్లు, బీసీల కార్పొరేషన్‌కు రూ. 3 వేల కోట్లు, ముఖ్యమంత్రి యువనేస్తానికి రూ. 1200 కోట్లు, డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు రూ. 1100 కోట్లు, చంద్రన్న బీమాకు రూ. 354 కోట్లు బడ్జెట్ లో కేటాయించారు.

చేనేతలకు రూ. 225 కోట్లు, చంద్రన్న పెళ్లి కానుక కింద బీసీలకు రూ. 175 కోట్లు, చంద్రన్న పెళ్లి కానుక కింద ఎస్సీలకు రూ. 128 కోట్లు, పెన్షన్‌ కింద వృద్ధాప్య, వింతంతువులకు రూ. 10,401 కోట్లు కేయిస్తున్నట్లు యనమల వెల్లడించారు. 

Similar News