ప్రధాని మోదీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ మద్దతు

ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి మద్దతు ప్రకటించారు.

Update: 2020-04-04 05:49 GMT
YS Jagan (File Photo)

ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి మద్దతు ప్రకటించారు. ఈ నెల 5వ తేదీన ఆదివారం రాత్రి ప్రధాని పిలుపు మేరకు ప్రజలు దీపాలు వెలిగించాలన్నారు. చెడు మీద మంచి.. చీకటి మీద వెలుగు గెలవాలని, అలాగే కరోనా మీద చేస్తున్న పోరాటంలో మానవాళి విజయం సాధించాలని సీఎం ఆకాంక్షించారు. మన శత్రువు కరోనా అని చాటి చెపుతూ.. కుల మతాలకు, ప్రాంతాలకు రాష్ట్రాలకు అతీతంగా అందరం ఒక్కటేనని భారతీయులంతా ఏకమవ్వాలి అని సీఎం జగన్ పిలుపునిచ్చారు.

ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ నెల 5న రాత్రి 9 గంటలకు 9 నిమిషాల ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ళ ముంగిట దీపాలు, కొవ్వతులు, సెల్‌ఫోన్‌ లైట్లను వెలిగించాలని సీఎం సూచించారు. భారతీయులంతా ఒక్క తాటిమీదకు రావాలన్న ప్రధాని పిలుపునకు మద్దతు పలకాలని శ్రీ జగన్‌ విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా ఈ నెల 5వ తేదీన ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటూ ప్రతి ఒక్కరూ దీపాలు వెలిగించాలని ప్రధాని మోదీ శుక్రవారం వీడియో సందేశాన్ని పంపించారు. ప్రధాని నిర్ణయానికి పలు రాష్ట్రాల సీఎంలు మద్దతు తెలిపారు. జనసేనా అధినేత పవన్ కళ్యాణ్ కూడా శుక్రవారం ప్రధానికి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News