లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల్లోకి వలసలు బాట కొనసాగుతోంది. ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్ కాంగ్రెస్‌లో చేరారు. బుధవారం ఊర్మిళా మటోండ్కర్ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఊర్మిళ వెంట మహారాష్ట్ర విభాగం కాంగ్రెస్ చీఫ్ మిలింద్ డియోరా, సీనియర్ నేత సంజయ్ నిరూపమ్ ఉన్నారు. కాగా ఉత్తర ముంబై నుంచి ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారని భావిస్తున్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ ఓ ప్రకటన వెలువరించనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఊర్మిళ మంటోండ్క్రర్ మాట్లాడుతూ తనను కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతించిన రాహుల్‌తో పాటు కాంగ్రెస్ నేతలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.