అమరవీరుల స్మృతి చిహ్నం 'నేషనల్ వార్ మెమోరియల్'

Update: 2019-02-25 12:37 GMT

అమరవీరులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం వారి స్మృతి చిహ్నంగా దేశరాజధాని న్యూఢిల్లీలో నేషనల్ వార్ మెమోరియల్ ఏర్పాటు చేసింది. సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో నేషనల్ వార్ మెమోరియల్' ఏర్పాటు చేసింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 25,942 మందికి పైజా జవాన్లు వీరమరణం పొందారు. వారి గౌరవార్థం స్మృతి చిహ్నం నిర్మించాలని సాయుధ బలగాలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. సాయుధ బలగాల డిమాండ్ మేరకు 2015లో కేంద్ర ప్రభుత్వం న్యూ ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర నేషనల్ వార్ మెమోరియల్, నేషనల్ వార్ మ్యూజియం ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. 

Similar News