శబరిమల చరిత్రలో కొత్త అధ్యాయం...అయ్యప్పను దర్శించుకున్న ఇద్దరు మహిళలు

శబరిమల చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరలేచింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తొలిసారి ఇద్దరు మహిళలు శబరిమల ఆలయంలోకి అడుగుపెట్టారు. ఈ తెల్లవారుజామున 3గంటల 45 నిమిషాలకు 45 ఏళ్ల లోపు ఇద్దరు మహిళలు అయ్యప్పను దర్శించుకున్నారు.

Update: 2019-01-02 05:46 GMT
Sabarimala Temple

శబరిమల చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరలేచింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తొలిసారి ఇద్దరు మహిళలు శబరిమల ఆలయంలోకి అడుగుపెట్టారు. ఈ తెల్లవారుజామున 3గంటల 45 నిమిషాలకు 45 ఏళ్ల లోపు ఇద్దరు మహిళలు అయ్యప్పను దర్శించుకున్నారు. నడుచుకుంటూ సన్నిధానం చేరుకున్న ఇద్దరు మహిళలు గర్భగుడి వరకు వెళ్లి అయ్యప్పను దర్శనం చేసుకున్నారు.

కోజికోడ్‌ జిల్లాకు చెందిన బిందు, కనకదుర్గ మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో పంబ ప్రాంతానికి వచ్చారు. అక్కడి నుంచి ఎలాంటి పోలీసు భద్రత లేకుండానే సన్నిదానం చేరుకున్నారు. 18 మెట్లు ఎక్కి అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత 50ఏళ్లు లోపు మహిళలు అయ్యప్పను దర్శనం చేసుకోవడం ఇదే తొలిసారి.

సుప్రీం కోర్టు తీర్పు తర్వాత శబరిమల ఆలయంలోకి ప్రవేశించడానికి మహిళా సంఘాలు ఎంత ప్రయత్నించినా అయ్యప్పను దర్శించుకోలేకపోయారు. భక్తల నుంచి తీవ్ర నిరసనలు ఎదురుకావడంతో పాటు ఆలయ పరిసరాల్లో పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో డిసెంబరు 18న బిందు, కనకదుర్గలు అయ్యప్పను దర్శించుకునేందుకు ప్రయత్నించారు. పోలీసుల సాయంతో పంబ నుంచి సన్నిధానానికి కిలోమీటరు దూరంలో ఉన్న మారకూటం వరకు చేరుకున్నారు. అయితే అక్కడ భక్తులు వీరిని అడ్డుకోవడంతో ఆ సమయంలో పోలీసులు వారిని వెనక్కి పంపించారు. తాజాగా ఈ తెల్లవారుజామున వీరిద్దరూ అయ్యప్పను దర్శించుకున్నారు. 

Similar News