తనకి మర్యాద ఇవ్వలేదని మెడికల్ షాప్ ఉద్యోగిని చితకబాదిన బీజేపి నేత సోదరుడు ..

Update: 2019-06-07 04:34 GMT

తానూ షాప్ కి వస్తే నిలబడి మర్యాద ఇవ్వలేదని కోపంతో ఓ మెడికల్ షాప్ ఉద్యోగిని చితకబాదాడు ఓ బీజేపి నేత సోదరుడు .. ఇక వివరాల్లోకి వెళ్తే బీహార్‌లోని బెత్తై నగరంలో ఈ నెల 3న ఈ సంఘటన జరిగింది.. జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలైన రేణు దేవి సోదరుడు పిను రాత్రి 9:10 గంటలకు ఓ మెడికల్ షాపు వద్దకు వచ్చాడు. దుకాణంలోని అందరూ లేచి నిలబడి ఆయనకు నమస్కారం పెట్టగా ఓ వ్యక్తి మాత్రం కూర్చునే ఉన్నాడు. అతడిని చూసి ఆగ్రహంతో ఊగిపోయిన పిను షాపులోకి వెళ్లి అతనిపై చేయి చేసుకున్నాడు.

వారికి అతడి అనుచరులు కూడా తోడయ్యారు. అందరూ కలిసి అతడిని చితకబాదారు. ఇదంతా సీసీ కెమరాలో రికార్డ్ అయింది .. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది.. అయితే దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు పిను కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన రేణు దేవి తన సోదరుడితో తనకు ఎటువంటి సంబంధం లేదని, అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

Tags:    

Similar News