తుది శ్వాస విడిచిన ప్రపంచ పొట్టి మనిషి మగర్‌

ప్రపంచంలోనే అతి పొట్టి మినిషిగా పేరు తెచ్చుకుని 'గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌' లో స్థానం సంపాదించుకున్న ఖగేంద్ర థాప మగర్‌ (27) కన్నుమూసారు.

Update: 2020-01-18 12:11 GMT

ప్రపంచంలోనే అతి పొట్టి మినిషిగా పేరు తెచ్చుకుని 'గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌' లో స్థానం సంపాదించుకున్న ఖగేంద్ర థాప మగర్‌ (27) కన్నుమూసారు. నేపాల్‌కు చెందిన మగర్ కొన్ని రోజులుగా నిమోనియాతో బాధపడుతున్నారని, శుక్రవారం రాత్రి తది శ్వాస విడిచారని మగర్ సోదరుడు మహేష్‌ థాప మగర్‌ తెలిపారు. 2.4 అంగులాల ఎత్తు మాత్రమే ఉన్న మగర్‌ 18వ ఏట 2010లో ప్రపంచంలోనే పొట్టి మనిషిగా 'గిన్సిస్‌' సర్టిఫికేట్‌ అందుకున్నారు. తరువాత అదే సంవత్సరం నేపాల్ నిర్వహించిన అందాల భామల పోటీలో విజేతలతో ఫోటోలకు ఫోజులిచ్చారు.

అంతేకాక నేపాల్ అందాలను చాటిచెప్పేందుకు ఎత్తైన పర్వత శిఖరం గురించి పర్యటకులకు వివరించేందుకు మగర్ బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేసి పలు దేశాలు పర్యటించారు. దాంతో పాటుగానే ప్రపంచంలోని అత్యంత పొట్టి అమ్మాయిలను, అబ్బాయిలను కలుసుకోవడాని వివిధ దేశాలతో పాటు, భారత్‌ దేశానికి కూడా వచ్చారు. 2010 నిర్వహించినట్టుగానే ప్రపంచం పొట్టిమునుషుల పోటీలను 2015 నిర్వహించారు. ఆ సంవత్సరం నేపాల్ లోనే పుట్టిన చంద్ర బహదూర్‌ డాంగీ (ఒక అడుగు 7.9 అంగుళాలు) చేతుల్లో మగర్‌ గిన్నీస్‌ రికార్డు కోల్పోయారు. తరువాత 2015లో డాంగీ మరణించడంతో మళ్లీ ప్రపంచ రికార్డు మగర్‌కే దక్కింది. 




Tags:    

Similar News