హమాస్‌తో సంబంధాలనే ఆరోపణలతో భారత విద్యార్థి అరెస్ట్: ఎవరీ బదర్ ఖాన్ సూరీ?

Badar Khan Suri: హమాస్ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని ఆరోపణల నేపథ్యంలోనే భారతీయ విద్యార్థి బదర్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నట్టు అమెరికా కు చెందిన ఫాక్స్ న్యూస్ మీడియా కథనం వెల్లడించింది.

Update: 2025-03-20 07:38 GMT

హమాస్‌తో సంబంధాలనే ఆరోపణలతో భారత విద్యార్థి అరెస్ట్: ఎవరీ బదర్ ఖాన్ సూరీ?

Badar Khan Suri: హమాస్ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని ఆరోపణల నేపథ్యంలోనే భారతీయ విద్యార్థి బదర్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నట్టు అమెరికా కు చెందిన ఫాక్స్ న్యూస్ మీడియా కథనం వెల్లడించింది. అమెరికాలో స్టూడెంట్ వీసాపై అమెరికాలో ఉంటున్నారు. వాషింగ్టన్ డీసీలోని జార్జ్ టౌన్ యూనివర్శిటీలో పోస్ట్ డాక్టోరల్ గా ఉన్నారు. హమాస్ కు మద్దతుగా సూరి యూనివర్శిటీలో ప్రచారం చేస్తున్నారని డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డీహెచ్ఎస్ లోని అసిస్టెంట్ సెక్రటరీ ట్రిసియా మెక్‌లాఫ్లిన్ ఆరోపించారు.

ఎవరీ బదర్ ఖాన్ సూరి?

జార్జ్ టౌన్ యూనివర్శిటీలో అల్వలీద్ బిన్ తలాల్ సెంటర్ ఫర్ ముస్లిం క్రిస్టియన్ అండర్ స్టాండింగ్ లో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ చేస్తున్నారు సూరి. మార్చి 17 రాత్రి వర్జీనియాలోని ఇంటి వెలుపల ఫెడరల్ ఏజంట్లు అతనిని అదుపులోకి తీసుకున్నారు. తనను అదుపులో తీసుకోవడంపై సూరి ఇమిగ్రేషన్ కోర్టులో సవాల్ చేశారు. తన భార్య పాలస్తీనా మూలాలున్నందున తనను టార్గెట్ చేశారని ఆ పిటిషన్ లో ఆయన తెలిపారు.ఇటీవలనే ఇదే రకమైన ఆరోపణలతో భారతీయ విద్యార్ధిని రంజని శ్రీనివాసన్ వీసాను డీహెచ్ఎస్ రద్దు చేసింది. దీంతో ఆమె స్వీయ బహిష్కరణకు గురయ్యారు. అమెరికాలో పలు యూనివర్శిటీల్లో పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనల్లో పాల్గొన్న 2 వేల మంది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News