అమ్మ బొమ్మని అమ్మగా అనుకుంటున్న బుడతడు.. వైరల్ వార్త!

శతకోటి సమస్యలకు అనంత కోటి ఉపయోగాలంటారు.. ఇదిగో సరిగ్గా అలాంటిదే ఇదే!

Update: 2019-12-16 04:28 GMT
Little boy engaged with games (Img source: sato_nezi twetter)

చిన్న పిల్లల్ని పెంచడం అత్యంత కష్టమైన పని. కొంత మంది పిల్లలు ఊరికే ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తున్నారో తెలుసుకుని ఆ అవసరం తీర్చేసరికి మరో కొత్త రాగం మొదలెడతారు. కొందరు అల్లరి గడుగ్గాయిలు ఉంటారు. ఒక్క క్షణం వారిని ఒంటరిగా వదిలేశామా.. ఇక అంతే. మరి కొందరు చిన్నారులకు ఎడతెగని భయం. తల్లి పక్కన లేకపోతే, ఒక్క నిమిషం కూడా ఉండలేరు. ఒకటే ఏడుపు మొదలెట్టేస్తారు.

ఇలా తల్లి కోసం ఏడిచే చిన్నారులతో తల్లులకు చాలా ఇబ్బంది. అసలు ఏ పనీ చేసుకోలేరు. కనీసం వంట చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. అటువంటి చిన్నారిని నిత్యం అంటిపెట్టుకుని ఉండాలంటే ఆ తల్లులకు ఏంతో కష్టంగా మారుతుంది.

ఇదిగో..ఇక్కడ మనం చెప్పుకుంటున్న జపాన్ బుడతడి తో అతని తల్లికి ఇదే సమస్య. కడుపునిండా పాలు పట్టి.. ఆడుకోవడానికి బొమ్మలు ఇచ్చి ఇంట్లో కొంచెం ఆ గడుగ్గాయికి దూరంగా జరిగి పని చేసుకుందామంటే కుదరదు. ఆ క్షణకాలానికే ఒకటిన్నర రాగం అందుకుంటాడు. అసలు తల్లి పక్కన ఉంటేనే ఆటైనా, పాటైనా ఈ చిన్నోడికి. అది ఆ తల్లికి కష్టంగా మారిపోయింది. ఆ చిన్నారి తల్లి దండ్రులిద్దరూ ఆలోచించారు. చివరికి అదిరిపోయే ఐడియా వచ్చింది ఇద్దరికీ.

వెంటనే దానిని అమలు చేశారు. సక్సెస్ అయ్యారు. ఇంతకీ ఆ ఐడియా ఏమిటో తెలుసా? ఆ చిన్నారి తల్లి నిలువెత్తు కటౌట్ ఒకటి.. సోఫాలో కూర్చున్నట్టున్న కటౌట్ ఒకటి తయారు చేసి ఇంట్లోపెట్టారు. ఆ బుడతడు ఆడుకుంటున్న ప్రదేశానికి అందనంత దూరంలో అమ్మ ఉందనిపించేలా కటౌట్ పెట్టారు. వాడు ఆడుకుంటూ వెనక్కి తిరిగి ఓ సారి చూసుకుని కటౌట్ లో కనపడిన అమ్మని చూసి హమ్మయ్య అనుకుని మళ్ళీ ఆదుకోవడం మొదలు పెడుతున్నాడు. చిన్నారుల చిలిపి చేష్టలంటే ఎవరికి సరదా ఉండదు చెప్పండి. అందులోనూ తల్లిదండ్రులకు.. ఆ కుర్రాడి ని ఆదుకోవడానికి వదిలిన తరువాత ఏం చేస్తాడో చూద్దామని చెప్పి అతని తండ్రి వీడియో తీసి దానిని ట్విట్టర్ లో షేర్ చేసి అందరితో తమ ముద్దుల తనయుడి సందడిని సరదాగా పంచుకున్నాడు. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్ గా మారిపోయి జపాన్ దాటి ప్రపంచమంతా చుట్టేస్తోంది. మరి మీరూ ఆ ట్వీట్ చూసి వారి ఐడియా ఎలా ఉందొ చూడండి! 




Tags:    

Similar News