US Warns Indian, Foreign Students: విదేశీ విద్యార్థులకు అమెరికా స్ట్రిక్ట్ వార్నింగ్.. క్లాస్ మిస్ అయితే వీసా రద్దే..!

పలు కారణాలతో విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేస్తూ, వారిని దేశం నుంచి వెనక్కి పంపుతున్న అగ్రరాజ్యం అమెరికా తాజాగా మరో కీలక హెచ్చరికను జారీ చేసింది.

Update: 2025-05-27 07:25 GMT

US Warns Indian, Foreign Students: విదేశీ విద్యార్థులకు అమెరికా స్ట్రిక్ట్ వార్నింగ్.. క్లాస్ మిస్ అయితే వీసా రద్దే..!

US issues warning to Indian and foreign students: పలు కారణాలతో విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేస్తూ, వారిని దేశం నుంచి వెనక్కి పంపుతున్న అగ్రరాజ్యం అమెరికా తాజాగా మరో కీలక హెచ్చరికను జారీ చేసింది. అమెరికాలోని విద్యాసంస్థల్లో చదివే భారత్‌ సహా అన్ని దేశాల విద్యార్థుల గైర్హాజరు, డ్రాపౌట్ వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని వీసాలను రద్దు చేసే అవకాశం ఉందని అమెరికా ఎంబసీ స్పష్టంచేసింది.

ఈ మేరకు మంగళవారం భారత్‌లోని అమెరికా ఎంబసీ ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో "మీరు చదువుతున్న విద్యాసంస్థ నుంచి డ్రాపౌట్ అయినా, తరగతులకు హాజరుకాకపోయినా, విద్యాసంస్థకు తెలియచేయకుండా స్టడీ ప్రోగ్రామ్‌ను వదిలేసినా, మీ విద్యార్థి వీసా (Student Visa) తక్షణమే రద్దవుతుంది. అంతేకాక, భవిష్యత్తులో ఎలాంటి అమెరికా వీసాలకు మీరు అర్హత కోల్పోతారు" అని హెచ్చరించింది.

అంతేకాకుండా, ఈ నిబంధనలన్నీ సీరియస్‌గా పాటించాలని, సమస్యల్లో పడకుండా ఉండేందుకు తమ విద్యా ప్రోగ్రామ్‌లకు విధిగా హాజరై, వీసా రూల్స్‌ను గౌరవించాలన్న సూచనను కూడా చేసింది. అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతుండటంతో, ఇటువంటి హెచ్చరికలు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.

Tags:    

Similar News