YouTuber: 'నా అన్వేషణ' అన్వేష్‌కు ఉక్రెయిన్ మహిళ స్ట్రాంగ్ వార్నింగ్: 'నువ్వు వెర్రి గొర్రెవి.. నీ పతనం మొదలైంది!'
యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్‌పై ఉక్రెయిన్ హిందూ మహిళ లిదియా లక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. అతడిని 'వెర్రి గొర్రె' అని విమర్శిస్తూ, చట్టపరంగా శిక్ష తప్పదని హెచ్చరించారు.
ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్, 'నా అన్వేషణ' ఫేమ్ అన్వేష్ చుట్టూ వివాదాలు ముదురుతున్నాయి. హిందూ దేవతలపై, ముఖ్యంగా సీతమ్మ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. తాజాగా, ఈ వివాదంలోకి ఉక్రెయిన్‌కు చెందిన హిందూత్వవాది లిదియా లక్ష్మి ప్రవేశించి, అన్వేష్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
'భగవద్గీత చదివినంత మాత్రాన హిందువువి కావు'
సోషల్ మీడియా వేదికగా అన్వేష్‌ను హెచ్చరించిన లిదియా లక్ష్మి, అతడిని 'కన్వర్టెడ్ గొర్రె' అంటూ సంబోధించారు. "నోటికి వచ్చినట్లు బూతులు మాట్లాడుతూ, సనాతన ధర్మాన్ని కించపరిచే నువ్వు.. కేవలం భగవద్గీత చదివానని చెప్పుకున్నంత మాత్రాన హిందువువి అయిపోవు. నీ అసలు రంగు మాకు తెలుసు" అంటూ మండిపడ్డారు.
లిదియా లక్ష్మి చేసిన సంచలన వ్యాఖ్యలు:
- అన్నీ తెలుసు: "నువ్వు ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో ఉన్నావని నాకు తెలుసు. అక్కడ నువ్వు ఏం చేస్తున్నావో, నీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో అన్నీ నా దగ్గర ఉన్నాయి."
- చట్టం విడిచిపెట్టదు: "భారత ప్రభుత్వం నిన్ను తిరిగి తీసుకువచ్చేలా మేము చేస్తాము. నువ్వు ఎన్ని క్షమాపణలు చెప్పినా చట్టం నుంచి తప్పించుకోలేవు."
- పతనం మొదలైంది: "నీ నోటి దురుసు వల్ల నీ అంతం మొదలైంది. ఇది నీకు నా ఫైనల్ వార్నింగ్."
ఎవరీ లిదియా లక్ష్మి?
ఉక్రెయిన్‌కు చెందిన లిదియా లక్ష్మి సనాతన ధర్మం పట్ల ఆకర్షితురాలై హిందూ మతాన్ని స్వీకరించారు. ఆమె ఏడేళ్ల పాటు భారత్‌లో ఉండి సంస్కృతి, కళలపై పరిశోధన చేశారు. భగవద్గీత మరియు అల్లూరి సీతారామరాజు స్పూర్తితో ఉక్రెయిన్ ఆర్మీలో కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆమె థాయ్‌లాండ్‌లోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయంలో పనిచేస్తూనే, అక్కడి పురాతన శివలింగాలపై పరిశోధనలు చేస్తున్నారు. గతంలో ఏపీ నుంచి పూజారులను పిలిపించి థాయ్‌లాండ్‌లో హిందూ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
అన్వేష్‌పై పెరుగుతున్న వ్యతిరేకత:
అన్వేష్ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అతడి ఇన్స్టాగ్రామ్ ఖాతాను అన్-ఫాలో చేయాలని, యూట్యూబ్ ఛానెల్‌ను బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియాలో భారీ స్థాయిలో క్యాంపెయిన్ నడుస్తోంది. అన్వేష్ విదేశాల్లో ఉండటంతో అతడిని రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.