నా ప్రాణాలు కాపాడిన వైద్యులకు జీవితాంతం రుణపడి ఉంటా : బ్రిటన్ ప్రధాని

చైనాలో మొదలైన మహమ్మారి కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు వ్యాపించి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

Update: 2020-04-12 17:26 GMT
Boris Johnson (File Photo)

చైనాలో మొదలైన మహమ్మారి కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు వ్యాపించి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ప్రస్తుతం చైనాలో ఈ కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ మిగతా దేశాల్లో మాత్రం దీని ప్రభావం ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా అమెరికా, స్పెయిన్, ఇటలీ , బ్రిటన్ మొదలగు దేశాలలో కరోనా విలయతాండవం చేస్తుంది. ఇక బ్రిటన్‌ విషయానికి వస్తే అక్కడ ఇప్పటి వరకు 78 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. మరణాల సంఖ్య 10వేలకు చేరవవుతుంది.

తాజాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సైతం కరోనా బారినపడిన సంగతి తెలిసిందే.. గత ఆదివారం నుంచి ఆయన సెయింట్ థామస్ హాస్పిటల్‌లో ఐసీయూలో కరోనాకు చికిత్స తీసుకున్నారు. తాజాగా చేసిన పరీక్షల్లో ఆయనకి కరోనా నెగిటివ్ రావడంతో వైద్యులు ఆయనని డిశ్చార్జ్ చేశారు.. ఈ మేరకు తనకు వైద్యం అందించిన వైద్యులకు ఆస్పత్రి బృందానికి జీవితాంతం రుణపడి ఉంటానని బ్రిటన్ ప్రధాని వెల్లడించారు. కేవలం థ్యాంక్స్ చెప్పడంతోనే తన రుణం తీరిపోదని వ్యాఖ్యానించారు.


Tags:    

Similar News