ఇస్లాంవిక్ స్టేట్ అధినేత అబు బాకర్ అల్ బాగ్దాదీని అమెరికా సైన్యం హతమార్చిన సంగతి తెలిసిందే. అయితే ఇరాక్, టర్కీ, రష్యాల సహాయంతో పక్కా సమాచారంతో బాగ్దాదీ జాడనుఅమెరికా సైన్యం కనిపెట్టాయి. అమెరికా సైన్యంతో చుట్టుముట్టాయి అల్ బాగ్దాదీని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. అతని తోపాటు పిల్లలను కూడా బాంబుతో పేల్చిన సంగతి తెలిసందే. ఈ ఆపరేషన్ లో సైన్యంతో పాటు సైనిక జాగిలాలు పాల్గొన్నాయి. బాగ్దాదీని వెంటాడి తరిమిన కుక్క గాయపడటంతో దాని వివరాలను పెంటగాన్ గోప్యంగా ఉంచారు.
ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీటర్ లో వెల్లడించారు. తమ సైన్యం చేతిలో ఐసీస్ అధినేత అల్ బాగ్దాదీ కుక్కచావు చచ్చాడని పేర్కొన్నారు. అతడిని వెంటాడి పట్టుకోవడంలో సైనిక కే9 జాగీలాల కీలక పాత్ర పోషించాయని తెలిపారు. మా శునకం అద్భుతమైన సేవలు అందించిందని పేర్కొన్నారు. దాని పేరు మాత్రం వెల్లడించమని ఫోటో షేర్ చేస్తూ ట్వీటర్‌లో తెలిపారు.
అమెరికా సైన్యాధిపతి జనరల్ మార్క్ మాట్లాడుతూ.. బాగ్థాదీని మట్టుబెట్టడంతో శునకం కూడా సేవలందించాయని తెలిపారు. బాగ్థాదీ తనను హతమార్చుకునే క్రమంలో శునకానికి గాయాలైనట్లు వెల్లడించారు. అది కోలుకుని తిరిగి విధుల్లో చేరినట్లు పేర్కొన్నారు. బిన్ లాడెన్‌ను 2011లో హతమర్చినప్పుడు కైరో అనే శునకాలు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
We have declassified a picture of the wonderful dog (name not declassified) that did such a GREAT JOB in capturing and killing the Leader of ISIS, Abu Bakr al-Baghdadi! pic.twitter.com/PDMx9nZWvw
— Donald J. Trump (@realDonaldTrump) October 28, 2019