వెంటాడిన మృత్యువు.. అమెరికాలో హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైద్రాబాద్ కు చెందిన అబ్బరాజు పృథ్వీరాజ్ మృతి చెందాడు.

Update: 2024-05-17 10:59 GMT

Road Accident: వెంటాడిన మృత్యువు.. అమెరికాలో హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైద్రాబాద్ కు చెందిన అబ్బరాజు పృథ్వీరాజ్ మృతి చెందాడు. ఒక ప్రమాదం నుండి తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నప్పటికీ, ఆ వెంటనే జరిగిన మరో ప్రమాదంలో పృథ్వీరాజ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

పృథ్వీరాజ్ తండ్రి వెంకటరమణది సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్. విద్యుత్ శాఖలో ఉద్యోగం చేసి రిటైరయ్యారు. ఉద్యోగ విరమణ తర్వాత ఆయన హైద్రాబాద్ ఎల్ బీ నగర్ అలకాపురిలో స్థిరపడ్డాడు.

పృథ్వీరాజ్ అమెరికాలోని నార్త్ కరోలినాలో ఎనిమిదేళ్లుగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఆయన శ్రీప్రియను వివాహం చేసుకున్నాడు. గత ఏప్రిల్ లోనే వీరి రెండో పెళ్ళిరోజు జరుపుకున్నారు.

ఈ నెల 15న నార్త్ కరోలినా నుండి చార్లెట్ ప్రాంతానికి పృథ్వీరాజ్ కారులో బయలుదేరారు. పృథ్వీరాజ్, ఆయన భార్య ప్రియతోపాటు ఆ కారులో మరో ముగ్గురున్నారు. దారిలో వీరు ప్రయాణిస్తున్న కారు మరో కారును ఢీకొట్టింది. ప్రమాదం జరిగినప్పుడు కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు.

అయితే, ఈ ప్రమాదం జరిగిన తరువాత దాని గురించి పోలీసులకు చెప్పాలని పృథ్వీరాజ్ తన ఫోన్ కోసం కారు వద్దకు వెళ్ళినప్పుడు ఆయనను మరో వాహనం ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ముందుగా ప్రమాదం జరిగిందని తమకు సమాచారం వచ్చిందని, ఆ తరువాత సోదరుడు చనిపోయిన వార్త తెలిసిందని ఎల్ బీ నగర్ లో ఉన్న అతని సోదరుడు విశ్వనాథ్ హెచ్ఎం డిజిటల్ కు తెలిపారు. మృతదేహం శనివారం నాడు హైద్రాబాద్ కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నామని అమెరికా అధికారులు తెలిపారని ఆయన చెప్పారు.

Tags:    

Similar News