Sheikh Hasina: షేక్ హసీనాకు ఆ దేశ ప్రభుత్వం భారీ షాక్
Sheikh Hasina: ఆమె దౌత్య పాస్‌పోర్టును రద్దు చేసిన అక్కడి తాత్కాలిక ప్రభుత్వం
Sheikh Hasina
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆ దేశ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఆమె దౌత్య పాస్‌పోర్టును అక్కడి తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేసింది. హసీనా హయాంలో పార్లమెంటు సభ్యులకు జారీ చేసిన అన్ని దౌత్య పాస్‌పోర్ట్‌లను రద్దు చేస్తూ తాజాగా బంగ్లా హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దౌత్య పాస్‌పోర్ట్‌లు కలిగి ఉన్న వారు ఎంపిక చేసిన దేశాలకు వీసా లేకుండా ప్రయాణించడానికి వీలవుతుంది. ఈ పాస్‌పోర్ట్ వల్లే హసీనా బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వచ్చి ఆశ్రయం పొందగలుగుతున్నారు. ఆమె ఆగస్టు 5 నుంచి భారతదేశంలో ఉంటున్నారు. యూకే లేదా అమెరికా వెళ్లాలని అనుకున్నప్పటికీ ఆ దేశాలు హసీనాకు ఇంకా అనుమతి ఇవ్వలేదు.
Next Story




