రష్యా ఆక్రమిత దొనెట్స్క్‌పై శతఘ్ని దాడి

Russia: రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌లోని దొనెట్స్క్‌ (DONESTSCK) పై శతఘ్ని దాడులు స్థానికంగా కలకలం రేపాయి.

Update: 2024-01-22 12:45 GMT

రష్యా ఆక్రమిత దొనెట్స్క్‌పై శతఘ్ని దాడి

Russia: రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌లోని దొనెట్స్క్‌ (DONESTSCK) పై శతఘ్ని దాడులు స్థానికంగా కలకలం రేపాయి. నగర శివారు టెక్‌ స్టిల్‌ ష్చిక్‌లోని మార్కెట్‌పై జరిగిన ఈ దాడుల్లో కనీసం 25 మంది మృతి చెందారు. మరో 20 మందికి గాయాలు కాగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో అత్యవసర సేవలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉక్రెయిన్‌ సైన్యమే ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘటనపై ఇప్పటి వరకు కీవ్‌ స్పందించలేదు.

మరోపక్క రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌ నగరానికి 165 కిలో మీటర్ల దూరంలోని ఉస్టులుగా నౌకాశ్రయంలోని రసాయనాల ఎగుమతి టెర్మినల్‌ వద్ద రెండు భారీ పేలుళ్లు సంభవించాయి. ఉక్రెయిన్‌ డ్రోన్ల దాడి కారణంగా గ్యాస్‌ ట్యాంక్‌ పేలుడు జరిగిందని స్థానిక మీడియా వెల్లడించింది. రష్యాలోని రెండో అతిపెద్ద గ్యాస్‌ ఉత్పత్తిదారైన నోవాటెక్‌ మంటలు చెలరేగిన ఆ ప్రాంతాన్ని నిర్వహిస్తోంది.

బయటశక్తుల దాడుల కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు సంస్థ పత్రికా ప్రకటనలో వెల్లడించింది. ఈ సంఘటన కారణంగా ఎవరూ చనిపోలేదని, అయితే ఆ ప్రాంతంలో హై అలర్ట్‌ ప్రకటించింది. ఇంకో పక్క ఉక్రెయిన్‌కు చెందిన ఖర్కీవ్‌ ప్రాంతంలోని గ్రామం క్రొఖ్‌మల్నేను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు రష్యా రక్షణశాఖ ప్రకటించింది.

Tags:    

Similar News