శ్రీలంకకు తప్పిన మరో ముప్పు

Update: 2019-04-22 04:51 GMT

 శ్రీలంకలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమానికి వందలాది మంది ప్రజలు బలయ్యారు. మరో 450 మంది దాకా చికిత్స పొందుతున్నారు. తాజాగా ఇంటెలీజెన్స్ సిబ్బంది అప్రమత్తతో మరో పెను ముప్పు తప్పింది. వరుస పేలుళ్లతో వణికిపోయింది కొలంబో.. తాజాగా మరో శక్తివంతమైన బాంబును గుర్తించడం కలకలం రేపుతోంది. కొలంబియా కతునాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో మెయిన్‌ టెర్మినల్‌ రోడ్డులో అతిప్రమాదకరమైన ఐఈడీ పేలుడు పదార్థాలను సిబ్బంది తొలగించారు. దీంతో మరో పెద్ద ప్రమాదం తప్పింది. కొలంబో పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వస్తువులను, వ్యక్తులపై తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో శ్రీలంక వైమానిక దళం (ఎస్‌ఎల్‌ఏ ఎఫ్‌) సిబ్బంది ఐఈడీ బాంబును నిర్వీర్యం చేశారని స్థానిక మీడియా కధనం ప్రసారం చేసింది. 

Similar News