చిరుత పవర్ ముందు దాసోహమన్న కొండ చిలువ!

కొండచిలువ..చిరుతపులి ల మధ్య యుద్ధం.. చిరుత పంజాకి తల వంచిన సర్పం!

Update: 2019-11-20 11:57 GMT
Image taken from YouTube video of Kruger sightings

అడవిలో చోటు చేసుకునే సంఘటనలు రియల్ గా చూడలేం. కొన్ని సంఘటనలు అరుదుగా మాత్రమె కెమెరా కంటికి చిక్కుతాయి. అడవి మృగాల మధ్య నిత్యం బతుకు పోరాటం జరుగుతూనే ఉంటుంది. బలం ఉన్న జీవే అక్కడ జీవితాన్ని గడపగలుగుతుంది.

ఇదంతా ఎందుకంటే, అడవిలో జరిగే సంఘటనలు ప్రత్యక్షంగా చూడటం మనకి సాధ్యం కాదు. టెక్నాలజీ పుణ్యమా అని కొద్దో గొప్పో చూడగాలుగుతున్నా అవి గ్రాఫిక్స్ మాయం కావడం జరుగుతోంది. అరుదుగా మాత్రమే కొన్ని సంఘటనలు కెమెరా కంటికి చిక్కి మన వరకూ వస్తాయి. అటువంటిదే ఇది కూడా.

తీరిగ్గా ఉన్న చిరుత పులిని వేటాడేద్దామనుకుంది ఓ అతి పెద్ద కొండ చిలువ. మొదట్లో దాని ప్రతాపం చూపించింది కూడా. అయితే, చిరుత పవర్ ముందు నిలబడలేకపోయింది. తప్పించుకుందామని ప్రయత్నించింది కానీ, సాధ్యం కాలేదు పాపం.

ఈ సంఘటన కెన్యాలో చోటు చేసుకుంది. డైలీ మెయిల్ కధనం ప్రకారం కెన్యాలోని మాసాయి మారా ట్రైయాంగిల్ రిజర్వ్ లో జరిగిన సంఘటన వీడియో లో చిక్కింది. ఈ వీడియోలో ఒక అతి పెద్ద కొండచిలువ చిరుతపులి పై దాడికి దిగింది. అది గమనించి అలర్ట్ అయిన చిరుత తన పంజాతో ఆ కొండ చిలువ పై ఎదురుదాడికి దిగింది. ముందు ఆ పాము చిరుతను పట్టుకుని దానిని చుట్టేసేందుకు విపరీతంగా ప్రయటించింది. కానీ చిరుత బలం ముందు దాని బలం సరిపోలేదు. చివరికి చిరుత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ చిరుత వదలలేదు. దాంతో ఆ కొండ చిలువ పని అయిపొయింది.

మొదట ఈ వీడియో తీసిన వారు రెండిటి మధ్యా జరుగుతున్న పోరులో చిరుత పని అయిపోయిందని భావించారు. రెండూ పోరాడుతూ కొద్ది సెకన్ల పాటు చెట్టు పక్కకి వెళ్ళడంతో అక్కడ వారికి కొండ చిలువ తోక మాత్రమె బయటకు కనిపించింది. దీంతో వారు అల భావించారు. అయితే, చివరికి కెమెరా ఫోకస్ లోకి అవి వచ్చేటప్పటికి సీన్ మారిపోయింది.

''మేము అందరం కొండచిలువ చేతిలో చనిపోబోతున్న చిరుతని అరుదైన వీడియోలో బందిస్తున్నామని అనుకున్నాం. అయితే, అందుకు విరుద్ధంగా జరిగింది. చిరుత బలం ముందు కొండ చిలువ ప్రయత్నాలు నిలువలేదు." అంటూ చెప్పారు ఈ వీడియో తీసిన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ 28 ఏళ్ల మైక్ వెల్టన్.

ఆ అరుదైన వీడియోను మీరూ చూడండి..

Full View

Tags:    

Similar News