మహిళా మేయర్ పై నిరసనకారుల దాడి

20 ఏళ్ల విద్యార్థి మృతికి సౌత్ అమెరికా దేశం బొలీవియా కొచాబాంబ పట్టణ మేయర్‌ పేట్రిసియా ఆర్సే కారణమని ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారు ఆమెపై దాడిచేశారు.

Update: 2019-11-08 08:32 GMT

20 ఏళ్ల విద్యార్థి మృతికి సౌత్ అమెరికా దేశం బొలీవియా కొచాబాంబ పట్టణ మేయర్‌ పేట్రిసియా ఆర్సే కారణమని ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారు ఆమెపై దాడిచేశారు. మేయర్ కార్యాలయానికి నిప్పంటించి ఆమెను వీధిలోకి తీసుకొచ్చారు. అంతటితో ఆగక ఆమెను నడి రోడ్డుపైన మోకాళ్లపైన కూర్చోబెట్టి అమానుషంగా ప్రవర్తించారు. ఆమె జుట్టును కత్తిరించి ఆమెపై ఎర్రటి నీళ్లని పోసారు. అనంతరం విద్యార్ధి చావుకు నువ్వే కారణమని గట్టిగా నినాదాలు చేశారు. 

 బొలీవియా అధ్యక్షుడిగా ఎన్నికయిన ఎవో మారెల్స్‌ రిగ్గింగ్‌కు పాల్పడి అధికారంలోకి వచ్చారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అధికార పార్టీ మూమెంట్‌ ఫర్‌ సోషలిజంకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు నిరసన తెలుపుతూ ఈ దారుణానికి ఒడిగట్టాయి. ఈ పార్టీల మధ్య జరిగిన గొడవల్లో ఇప్పటి వరకు ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా మరో కొంతమంది గాయపడ్డారు. వారిలో 20 ఏళ్ల విద్యార్థి కూడా ఉన్నాడు. దీంతో వారంతా మేయర్‌ పేట్రిసియా ఆర్సే దీనికి కారణమని ఆమెపై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు వచ్చి ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపైన దేశ ఉపాధ్యక్షుడు అల్వారో గ్రేసియా స్పందిస్తూ మహిళగా పుట్టడం ఒక తప్పయితే, నిజాయితీగా ఉండటమే మరో ఆమె చేసిన మరో తప్పు అని వ్యాఖ్యానించారు. కాగా బొలీవియా అధ్యక్షుడు ఎవో మోరాల్స్‌ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.  



Tags:    

Similar News