జమ్మూ కాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన రద్దు

Update: 2019-10-31 05:54 GMT

అవిభక్త జమ్మూ కాశ్మీర్‌లో విధించిన రాష్ట్రపతి పాలనను గురువారం రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తరువాత రద్దు చేశారు. జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లోని రెండు యుటిలు గురువారం ఉనికిలోకి వచ్చాయి. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కార్యాలయం నుంచి అధికారిక నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. 2017 జూన్‌లో అవిభక్త జమ్మూకశ్మీర్‌లో పిడిపి నేతృత్వంలోని పాలనకు బిజెపి మద్దతు ఉపసంహరించుకున్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ రాజీనామా చేసిన తరువాత జూన్ 2017 లో జమ్మూ కాశ్మీర్‌లో కేంద్ర పాలన విధించబడింది. దీంతో రాష్ట్రంలో గవర్నర్‌ పాలన విధించారు. ఆరు నెలల తర్వాత రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. అయితే జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు కాశ్మీర్ లద్దాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356 ప్రకారం ఆ రాష్ట్రంలో విధించిన రాష్ట్రపతి పాలన కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తించదు. దీంతో దాన్ని ఎత్తివేస్తున్నట్లు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రకటించారు.

ఎల్టీగా మాథుర్‌ ప్రమాణస్వీకారం...

లద్దాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతానికి తొలి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఆర్‌.కె. మాథుర్‌ నేడు ప్రమాణన్వీకారం చేశారు. టు లేహ్‌లోని తిసూరులో జరిగిన కార్యక్రమంలో జమ్మూకళ్ళీర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిత్తల్‌ ఆయనచే ప్రమాణం చేయించారు. కశ్శీర్‌ గవర్నర్‌గా గిరిశ్‌ చంద్ర ముర్ము మరికాసేపట్లో ప్రమాణం చేయనున్నారు.



Tags:    

Similar News