టర్కీ ఆర్థికవ్యవస్థను నాశనం చేస్తాం : ట్రంప్

టర్కీ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టర్కీ సైనిక చర్యలు సిరియాలోని పౌరులను బలిగొంటున్నాయని వ్యాఖ్యానించారు. సిరియాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తోందని మండిపడ్డారు.

Update: 2019-10-15 09:38 GMT

టర్కీ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టర్కీ సైనిక చర్యలు సిరియాలోని పౌరులను బలిగొంటున్నాయని వ్యాఖ్యానించారు. సిరియాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తోందని మండిపడ్డారు. ఈ చర్యల వల్ల సంక్షోభానికి దారి తీస్తుందని స్పష్టం చేశామని , అయినా టర్కీ విధ్వంసక చర్యలను కొనసాగిస్తుందని అన్నారు. టర్కీ మారకపోతే ఆదేశ ఆర్ధిక వ్యవస్థలను పతనం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.

సైనిక దాడులకు కారణమవుతున్నటర్కీ నేతలపైనా కఠిన నిషేదం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అందులో భాగంగా స్టీల్ పై పన్ను పెంచుతున్నట్లు, వంద బిలియన్ డాలర్ల వాణిజ్య ఒప్పందం చర్చలను స్వస్తి పలికారు. సిరియాలో జరగుతున్న దాడులపై ఇటీవలె భారత్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.  

Tags:    

Similar News