అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని మోడీ భేటీ

PM Modi: మోడీకి విందు ఇవ్వనున్న బైడెన్ దంపతులు

Update: 2023-06-22 03:30 GMT

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని మోడీ భేటీ 

PM Modi: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని నరేంద్రమోడీ భేటీ అయ్యారు. ప్రధానికి బైడెన్‌ దంపతులు నేడు విందు ఇవ్వనున్నారు. రేపు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌ దంపతులు ఏర్పాటు చేసే విందుకు మోదీ హాజరుకానున్నారు. నేడు అమెరికా కాంగ్రెస్‌లో మోదీ ప్రసంగించనున్నారు. అనంతరం నోబెల్ విజేత, ఆర్థికవేత్త పాల్‌ రోమన్‌తో భేటీ కానున్నారు.

శ్వేత సౌధానికి వెళ్లేందుకు మోదీ వాషింగ్టన్‌ డీసీకి చేరుకొనే సమయానికి వర్షం పడుతోంది. అయినా, ఇండో-అమెరికన్లు ఆయన కోసం వేచి ఉండి స్వాగతం పలికారు. దీనిపై మోదీ ట్విటర్‌లో స్పందించారు. వాషింగ్టన్‌ డీసీ చేరుకొన్నానానని. భారతీయుల ఆత్మీయ స్వాగతం.. ఇంద్రదేవత ఆశీర్వాదం దీనిని మరింత స్పెషల్‌గా చేశాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

అనంతరం ప్రధాని మోదీ శ్వేతసౌధానికి చేరుకున్నారు. అక్కడ జో బైడెన్‌, ఆయన సతీమణి జిల్‌ బైడెన్‌ స్వాగతం పలికారు. జో బైడెన్‌, ఆయన కుటుంబీకులను మోదీ ఆత్మీయంగా కలుసుకున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి వెల్లడించారు. ఈ భేటీలో ఇరు దేశాధినేతలు ఆత్మీయ బంధాన్ని, స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకున్నారన్నారు. ఈ సందర్భంగా భారత్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన సంగీత కార్యక్రమాన్ని స్టూడియో ధూమ్‌ అనే సంస్థ నిర్వహించింది.

Tags:    

Similar News