ఫిలిప్పిన్స్ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టో అరెస్ట్

Rodrigo Duterte Arrest: ఫిలిఫ్పిన్స్ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టో అరెస్టయ్యారు. అంతర్జాతీయ నేర న్యాయస్థానం ఐసీసీ వారెంట్ మేరకు డ్యూటెర్టో అరెస్టయ్యారు.

Update: 2025-03-11 08:11 GMT

ఫిలిప్పిన్స్ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టో అరెస్ట్

Rodrigo Duterte Arrest: ఫిలిఫ్పిన్స్ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టో అరెస్టయ్యారు. అంతర్జాతీయ నేర న్యాయస్థానం ఐసీసీ వారెంట్ మేరకు డ్యూటెర్టో అరెస్టయ్యారు. హాంకాంగ్ నుంచి మనీలాకు చేరుకున్న డ్యూటెర్టో‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ ను అరికట్టేందుకు ఆయన తీసుకున్న చర్యల్లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయని ఆయనపై ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన అంతర్జాతీయ నేర న్యాయ స్థానం విచారించింది. డ్యూటెర్టో అధికారుల కస్టడీలో ఉన్నారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు ప్రకటించారు.

మాదక ద్రవ్యాల కట్టడి కోసం తీసుకున్న చర్యల్లో భాగంగా మరణించిన కుటుంబ సభ్యులు డ్యూటెర్టో అరెస్ట్ ను స్వాగతించారు. డ్యూటెర్టో అధికారంలో ఉన్న సమయంలో ఫిలిప్పిన్స్ లో జరిని మానవ హక్కుల ఉల్లంఘనలపై ఐసీసీ విచారణ చేపట్టింది. ఐసీసీ తీసకున్న నిర్ణయం తో ఐసీసీ నుంచి ఫిలిప్పిన్స్ వైదొలిగింది.

దావౌ నగర మేయర్ గా ఉన్న సమయంలో డ్యూటెర్టో అవలంభించిన విధానాలను దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఇదే విధానాలను అమలు చేస్తానని హామీ ఇచ్చారు. డ్యూటెర్టో తీసుకున్న చర్యలపై ఐసీసీ అధికార పరిధిపై అభ్యంతరాలను కోర్టు తోసిపుచ్చింది. 2023 జులైలో విచారణను ప్రారంభించారు. అయితే ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి మార్కోస్ ప్రభుత్వం దర్యాప్తునకు సహకరించబోమని తెలిపింది.

ఇంటర్ పోల్, ప్రుత్వం నుంచి అవసరమైన సహాయం కోరితే దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని అధ్యక్ష కార్యాలయం కమ్యూనికేషన్స్ కార్యాలయ అధికారి కాస్ట్రో మీడియాకు చెప్పారు. ఈ ఏడాది మేలో దావౌ నగర మేయర్ పదవికి డ్యూటెర్టో పోటీ చేయనున్నారు. ఇందుకు ఆయన రంగం సిద్దం చేసుకుంటున్నారు.

Tags:    

Similar News