భారత్‌తో సంబంధాలపై పాక్‌ కీలక నిర్ణయం

Update: 2019-08-07 14:25 GMT

జమ్ముకశ్మీర్‌పై భారత్‌ తీసుకున్న నిర్ణయంపై పాక్‌ అగ్గిమీద గుగ్గిలం అవుతుంది. 370 ఆర్టికల్‌ రద్దుతో పాటు రాష్ట్రాన్ని రెండుగా విభజించడంతో కశ్మీర్‌లో ఉగ్రదాడులు పెరుగుతాయని పుల్వామా ఘటనలు రిపీట్‌ అయ్యే అవకాశం ఉందంటూ నోరుపారేసుకున్న ఇమ్రాన్‌ ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌తో దౌత్య, వాణిజ్య సంబంధాలు నిలిపేయాలని నిర్ణయించారు. దీంతో భారత్‌లో ఉన్న పాక్‌ రాయబారిని వెంటనే వెనక్కి రావాలని ఆదేశించిన ఆయన పాక్‌లో ఉన్న భారత రాయబారిని వెంటనే దేశం విడిచి వెళ్లాలని స్పష్టం చేశారు. అలాగే కశ్మీర్‌ సమస్యను ఐక్యరాజ్యసమితిలో ప్రస్తావించాలని పాక్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది.  

Tags:    

Similar News