Lingcod: ప్రపంచంలోనే ఇది వింతైన చేప.. దీని ప్రత్యేకతలేంటో తెలుసా..?

* ఉత్తర పసిఫిక్‌లో ఉండే ఈ చేప నోటిలో 555 పళ్ళు ఉంటాయి.

Update: 2021-11-23 07:51 GMT

ప్రపంచంలోనే ఇది వింతైన చేప (ఫైల్ ఫోటో)

Pacific Lingcod: ప్రపంచంలో ఎన్నో వింత జీవులున్నాయి. వీటిని చూసినప్పుడు చాలామంది ఆశ్చర్యపోతారు. ఇందులో కొన్ని భూమిపై ఉంటే మరికొన్ని సముద్రాలలో కనిపిస్తాయి. అయితే మిగతా జీవులకు వీటికి చాలా తేడాలుంటాయి. అలాంటి కోవకే చెందుతుంది పసిఫిక్ లింగ్‌ కోడ్‌ చేప. ఇది ప్రపంచంలోనే వింతైన చేప. దాని దంతాల కారణంగా ఇది వెలుగులోకి వచ్చింది.

ఉత్తర పసిఫిక్‌లో ఉండే ఈ చేప నోటిలో 555 పళ్ళు ఉంటాయి. అంతేకాదు అవి చాలా పదునుగా ఉంటాయి. వాటిముందు బ్లేడ్‌ కూడా పనికిరాదు. లింగ్‌కోడ్ చేప గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. విశాలమైన నోరు ఉన్న ఈ చేపను చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు. మరికొందరు భయంతో పారిపోతారు. శాస్త్రవేత్తల నివేదిక ప్రకారం ఈ చేప ఇరవై పళ్ళు విరిగిపోయాయి.

ఈ చేప దంతాలు మనుషుల కంటే చాలా చిన్నవి కానీ చాలా పదునైనవి. ఈ చేపల నోటిలో రెండు సెట్ల దంతాలు ఉంటాయి. ఈ చేప పెద్దగా ఉన్నప్పుడు దాని దంతాలు 50 సెం.మీ. ఉంటాయి. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఈ చేపను, వాటి దంతాలపై మాత్రమే అధ్యయనం చేస్తున్నారు. యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ లాబొరేటరీ ఈ చేప దంతాలపై పరిశోధన చేసింది. ఇందుకోసం దాదాపు 20 చేపలను పట్టుకున్నారు.

ఆ తర్వాత పరిశోధకులు వీటని ఒక ట్యాంక్‌లో ఉంచారు. అందులో ఎరుపు రంగు కలపారు. అప్పుడు మైక్రోస్కోప్‌తో చూస్తే వాటి దంతాలు ఎర్రగా కనిపించాయి. ఈ 20 చేపలను ఉంచిన ట్యాంక్‌లో కొన్ని రోజుల తర్వాత చూస్తే ట్యాంక్ నుంచి సుమారు 10 వేల వరకు పళ్ళు బయటకు పడ్డాయి. వీటిని చూసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు.

Tags:    

Similar News