రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం

-ముగ్గురు శాస్త్రవేత్తలకు అవార్డు ప్రకటించిన..రాయల్ స్వీడీష్ అకాడెమీ -జాన్ బి. గుడెనఫ్,ఎం.స్టాన్లీ విట్టింగమ్, ఆకిరా మోషివోకు అవార్డులు

Update: 2019-10-09 11:27 GMT

రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం దక్కింది. 2019 ఏడాదికి గాను ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారాన్ని రాయల్ స్వీడీష్ అకాడెమీ బుధవారం నాడు ప్రకటించింది. జాన్ బి. గుడెనఫ్, ఎం.స్టాన్లీ విట్టింగమ్, ఆకిరా మోషివోకు ఈ పురస్కారాన్ని సంయుక్తంగా అందిస్తామని రాయల స్వీడీష్ అకాడమి ప్రకటించింది. లిథియం ఆయాన్ బ్యాటరీ అభివృద్ధి కోసం ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. ప్రతి ఏటా నోబెల్ పురస్కారాలను అందిస్తారు. పలు రంగాల్లో అత్యున్నతమైన నైపుణ్యాన్ని చూపిన వారికి నోబెల్ పురస్కారాలను అందిస్తారు. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలూ ప్రస్తుతం వివిధ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు చేస్తున్నారు. అంతకుముందు ఐదు విభాగాల్లో సాహిత్యం, వైద్యశాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, నోబెల్ పురస్కారం అందించారు.




Tags:    

Similar News