బెయిల్ పిటిషన్ తిరస్కరణ.. భారత్‌కు అప్పగిస్తే ఆత్మహత్య చేసుకుంటా..

పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో రూ.13వేల 500 కోట్లు అప్పు ఎగనామం పెట్టిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కథ అందరికీ తెలిసిందే.

Update: 2019-11-07 10:22 GMT

పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో రూ.13వేల 500 కోట్లు అప్పు ఎగనామం పెట్టిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కథ అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అతను నాలుగో సారి పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను లండన్ కోర్టు తిరస్కరించింది. మానసిక ఒత్తిడికి గురవుతున్న కారణంగా నీరవ్ మోడీకి బెయిల్ మంజూరు చేయాలని అతని తరఫున లాయర్ వాదించారు. అయినప్పటికీ వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ప్రధాన న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించారు.

ప్రస్తుతం అతన్ని నైరుతి లండన్‌లోని వాన్‌డ్స్‌వర్త్‌ జైలుకు పంపిచారు. డిసెంబర్ 4వ తేదీన వీడియే లింక్ ద్వారా నీరవ్ మోదీని విచారించనున్నారు. అయితే భారత్ లో మాత్రం అధికారులు నీరవ్ మోదీ చేసిన అప్పులు వసూలు చేయాలని, అతన్ని ఎలాగయినా భారత్ కు రప్పించాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో అతనికి సంబంధించిన కార్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకుని అమ్మేస్తున్నారు. ఈ క్రమంలో స్పందించిన నీరవ్ తనను భారత్ పంపిస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ లండన్ లాయర్లను బాగానే బెదిరిస్తున్నారు.



Tags:    

Similar News